AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి ఉందా?

Mercury Transit July 2026: జూలై 7న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో గురు గ్రహంతో ద్విద్వాదశ యోగం ఏర్పడుతోంది. ఈ గ్రహ యోగం వల్ల మిథునం, కన్యా, తులా రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక లాభాలు, కుటుంబ సంతోషం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి ఉందా?
Mercury Transit July 2026
Rajashekher G
|

Updated on: Jul 05, 2026 | 5:37 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పులు వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని విశ్వసిస్తారు. జూలై 7న బుధుడు కర్కాటక రాశిని విడిచి తన స్వరాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం సందర్భంగా గురు గ్రహంతో ‘ద్విద్వాదశ యోగం’ ఏర్పడుతుంది. ఈ యోగంలో బుధుడికి గురుడు రెండో స్థానంలో, గురుడికి బుధుడు పన్నెండో స్థానంలో ఉంటారు. ఈ గ్రహస్థితి కారణంగా కొన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

మిథున రాశి

మిథున రాశికి అధిపతి అయిన బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి, కొత్త అవకాశాలు లభించవచ్చు. కోరుకున్న ఉద్యోగం లేదా పదోన్నతి వచ్చే సూచనలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సఖ్యత, అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశికి కూడా బుధుడే అధిపతి కావడంతో ఈ రాశి మార్పు శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కూడా లభించవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. పితృఆస్తి లేదా కుటుంబ ఆస్తుల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తులా రాశి

ద్విద్వాదశ యోగం తులా రాశివారికి అదృష్టాన్ని కలిగించే యోగంగా భావిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూల సమయం కావచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని, బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!