లెనిన్‌తో సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అయిన భాగ్యశ్రీ బోర్సే.

05 July  2026

Pic credit - Instagram

Rajeev 

హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. 

హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు. 

దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

ఇదిలా ఉంటే తొలి తెలుగు సినిమాకే ఆమె తెలుగు నేర్చుకుంది. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. 

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌, దుల్కర్ సల్మాన్ కాంత, రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా చేసింది. కానీ ఈ సినిమాలు హిట్ అవ్వలేదు. 

ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.