AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: 116 ఏళ్ల భక్తురాలి అచంచల భక్తికి టీటీడీ గౌరవం.. ఈ బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం

116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనానికి వచ్చిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు తితిదే ప్రత్యేక గౌరవం కల్పించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. నవనీతమ్మ అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

Tirumala: 116 ఏళ్ల భక్తురాలి అచంచల భక్తికి టీటీడీ గౌరవం.. ఈ బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం
116 Year Old Devotee
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2026 | 6:03 PM

Share

116 ఏళ్ల వయసులోనూ శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించిన బీఆర్ నాయుడు.. ఈ వయసులోనూ నవనీతమ్మ చూపించిన భక్తి, సంకల్పం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆమెకు శ్రీవారి ఆశీస్సులు లభించి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు.

శనివారం అలిపిరి నడక మార్గం ద్వారా నవనీతమ్మ తిరుమలకు చేరుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తొలుత ఆమె వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో కర్ణాటకకు చెందిన భక్తురాలిగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు స్వయంగా స్పందించి, వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు టీటీడీని సంప్రదించాలని కోరారు. అనంతరం తితిదే విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టి, ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని గుర్తించారు. ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉంటున్నట్లు నిర్ధారించారు. వృద్ధురాలి వివరాలు కన్ఫామ్ అయిన వెంటనే ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. నవనీతమ్మ భక్తి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా భక్తుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం..
బామ్మగారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం..
చిన్న బ్రేక్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్న భారత స్టార్ పేసర్
చిన్న బ్రేక్ తర్వాత నెట్స్‌లో చెమటోడుస్తున్న భారత స్టార్ పేసర్
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం లభిస్తుందట.. ఐశ్వర్యం..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం లభిస్తుందట.. ఐశ్వర్యం..
చూశారా ఈ చిత్రం.. ఎలా బయటపడిందంటే..?
చూశారా ఈ చిత్రం.. ఎలా బయటపడిందంటే..?
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీళ్లే
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు వీళ్లే
అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి
అరుదైన ద్విద్వాదశ యోగం: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభాలు.. మీ రాశి
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఇంకెన్ని చూడాలి సర్.. ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన భార్య
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఏంటి మేడమ్.. ఇది మీరేనా! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!
ఏ బ్రాంచి బెటర్‌ బ్రో.. EAPCET 2026 కౌన్సెలింగ్‌లో గజిబిజీ!