వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే.. కోడెల మృతి పై చంద్రబాబు దిగ్భాంతి..
కోడెల శివప్రసాదరావు మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. కోడెల చాలా మానసిక క్షోభను అనుభవించారని.. వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. అసలు కోడెలకు భయమంటే ఏంటో తెలియదని.. కాని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందోననే భయంతోనే ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులతో నిద్ర కూడా పట్టడం లేదని తనకు చెప్పారని చంద్రబాబు తెలిపారు. డాక్టర్‌గా ఆయన […]

కోడెల శివప్రసాదరావు మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. కోడెల చాలా మానసిక క్షోభను అనుభవించారని.. వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. అసలు కోడెలకు భయమంటే ఏంటో తెలియదని.. కాని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందోననే భయంతోనే ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులతో నిద్ర కూడా పట్టడం లేదని తనకు చెప్పారని చంద్రబాబు తెలిపారు. డాక్టర్‌గా ఆయన మంచి పేరు సంపాదించారని గుర్తుచేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఎంతో ధైర్యంగా ఉండే వ్యక్తి.. అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం విచారకరమంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.