తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. […]

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2019 | 6:42 PM

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది.

కాగా, ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తోంది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఎర్రమంజిల్‌లో పురాతన భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో దానిపై విచారించిన కోర్టు.. అక్కడి భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?