జోలె పట్టిన చంద్రబాబు
రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు. రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా మచిలీపట్నంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన జోలె పట్టి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు. రాజధాని కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా అఖిలపక్షం గురువారం నాడు మచిలీపట్నంలో పాదయాత్ర నిర్వహించింది. ఇందులో టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. పాదయాత్ర మెయిన్ సెంటర్‌కు […]
రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలె పట్టారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు. రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా మచిలీపట్నంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన జోలె పట్టి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించారు.
రాజధాని కోసం నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా అఖిలపక్షం గురువారం నాడు మచిలీపట్నంలో పాదయాత్ర నిర్వహించింది. ఇందులో టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. పాదయాత్ర మెయిన్ సెంటర్‌కు చేరుకున్న వెంటనే చంద్రబాబు జోలె పట్టారు. విరాళాలు సేకరణ ప్రారంభించారు. చంద్రబాబు విరాళాల సేకరణకు పలువురు తమ వద్ద వున్న నగదును విరాళంగా ఇచ్చారు. కొందరు మహిళలు కూడా విరాళమిచ్చేందుకు యత్నించగా చంద్రబాబు వారి వద్దకు తానే స్వయంగా వెళ్ళి.. రాజధాని అంశాన్ని వివరించారు.