సిపిఐ యూ టర్న్.. రసకందాయంలో హుజూర్ నగర్

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రోజుకో పరిణామం అసక్తి రేపుతూ.. ఉత్కంఠకు గురిచేస్తోంది. తాజాగా సిపిఐ పార్టీ తీసుకున్న యూ టర్న్ మరోసారి ఆ పార్టీ సమ్మర్ సాల్ట్ వైఖరిని స్పష్టం చేసింది. తొలుత టిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించిన సిపిఐ నేత చాడా వెంకట్ రెడ్డి ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. సిపిఐ పార్టీ తీసుకున్న యూ టర్న్ హుజూర్ నగర్ […]

సిపిఐ యూ టర్న్.. రసకందాయంలో హుజూర్ నగర్

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రోజుకో పరిణామం అసక్తి రేపుతూ.. ఉత్కంఠకు గురిచేస్తోంది. తాజాగా సిపిఐ పార్టీ తీసుకున్న యూ టర్న్ మరోసారి ఆ పార్టీ సమ్మర్ సాల్ట్ వైఖరిని స్పష్టం చేసింది. తొలుత టిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించిన సిపిఐ నేత చాడా వెంకట్ రెడ్డి ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. సిపిఐ పార్టీ తీసుకున్న యూ టర్న్ హుజూర్ నగర్ ఉప ఎన్నికను మరోసారి రసకందాయంలో పడేసింది.

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో బై ఎలక్షన్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గత నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీల్లో టిడిపి ఈసారి సొంతంగా బరిలోకి అభ్యర్థిని దింపింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు సిపిఐ మద్దతు కోరగా.. సిపిఐ నేతలు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈలోగా ఆర్టీసీ సమ్మె రావడంతో సిపిఐ పార్టీపై కార్మికులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కార్మిక సంఘాలకు ప్రతినిధిగా చెప్పుకునే కామ్రేడ్లు ఒకింత ఇరకాటంలో పడి.. తీరా యూ టర్న్ తీసుకున్నారు. ఆదిలాబాద్లో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న చాడా వెంకట్ రెడ్డి హుజూర్ నగర్లో టిఆర్ఎస్  పార్టీ అభ్యర్థికిచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

మొదట్నించి సింగిల్ గానే ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన గులాబీ పార్టీ.. ఈసారి తామే స్వయంగా సిపిఐని మద్దతు కోసం సంప్రదించి, సానుకూల నిర్ణయాన్ని పొందారు. అయితే అనూహ్యంగా తెరమీదికొచ్చిన ఆర్టీసీ సమ్మె గులాబీ దళానికి సిపిఐని దూరం చేసింది. ప్రతీ ఎన్నికలోను టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే విజయాలు సాధిస్తుండడంతో పొత్తు కోసం ఎవరినీ ఆశ్రయించలేదు. అదే పరిస్థితి తాజాగా మరోసారి హుజూర్ నగర్ లో ఏర్పడింది. అయితే.. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో దూరంగా వుండడంతో కేశవరావు సారథ్యంలోని గులాబీ నేతలు సిపిఐ నేతలను పొత్తు కోసం సంప్రదించారు. దానికి వారు కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే చాడా వెంకట రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి, హుజూర్ నగర్లో మద్దతు పొందగలిగారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై చాడా వెంకట్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు. ఎమ్మెల్సీ పదవిపై తనకు ఆశలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ అపవాదును పోగొట్టుకోవడానికి ఆర్టీసీ సమ్మె తాజాగా చాడాకు కలిసి వచ్చినట్లయింది. గత ఎన్నికల్లో మహాకూటమిగా వున్న టిడిపి, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు హుజూర్ నగర్ బైపోల్ లో తలో స్టాండ్ తీసుకోవడంతో గులాబీ పార్టీ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటున్న సమయంలో సిపిఐ పార్టీ యూ టర్న్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. దీని ప్రభావం నుంచి గట్టెక్కేందుకు గులాబీ దళం ప్రతివ్యూహాన్ని సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ  వ్యూహంలో సిపిఐ, బిజెపి భాగస్తులయ్యారని టిఆర్ఎస్ నేతలు అంటుండడం విశేషం.

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu