AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేటు ప్రసక్తేలేదు..విపక్షాలది తప్పుడు ప్రచారమన్న పువ్వాడ

టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. సమర్థవంతమైన చర్యలతో ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తూ వారిని తప్పు దారి పట్టిస్తున్నాయని అజయ్ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో […]

ప్రైవేటు ప్రసక్తేలేదు..విపక్షాలది తప్పుడు ప్రచారమన్న పువ్వాడ
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 2:00 PM

Share

టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. సమర్థవంతమైన చర్యలతో ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తూ వారిని తప్పు దారి పట్టిస్తున్నాయని అజయ్ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎప్పుడు చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న పనులను గమనించటంలేదన్నారు.

రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు. సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోందన్నారు. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు. విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందన్నారు. టిమ్‌ మిషన్‌లు పనిచేయకుండా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు.

Follow Us
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి