ఆ పథకం వర్తించాలంటే.. ఆధార్ తప్పనిసరి!

ఉగ్రదాడులు, మావోయిస్టుల హింస, మత ఘర్షణల్లో బాధితులు కేంద్రం నుంచి ఆర్ధిక సాయం పొందాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. సీమాంతర కాల్పులు, మందు పాతర, ఐఈడీ పేలుళ్ల ఘటనల్లో బాధితులుగా మారినవారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రహోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ తెలిపింది. ఆయా బాధితులకు ఆర్ధిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద లబ్ది పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. […]

ఆ పథకం వర్తించాలంటే.. ఆధార్ తప్పనిసరి!
Follow us

|

Updated on: Jan 18, 2020 | 1:50 PM

ఉగ్రదాడులు, మావోయిస్టుల హింస, మత ఘర్షణల్లో బాధితులు కేంద్రం నుంచి ఆర్ధిక సాయం పొందాలంటే ఇక ఆధార్ తప్పనిసరి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. సీమాంతర కాల్పులు, మందు పాతర, ఐఈడీ పేలుళ్ల ఘటనల్లో బాధితులుగా మారినవారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రహోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ తెలిపింది. ఆయా బాధితులకు ఆర్ధిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద లబ్ది పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది.

ఒకవేళ ఆధార్ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇక ఈ నిబంధన అస్సాం, మేఘాలయ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఆధార్ దరఖాస్తు సెంటర్ లేకుంటే, బాధితులకు ఆర్ధిక సాయం అందించే విభాగం ఆ సదుపాయాన్ని కల్పించాలని తెలిపింది. ఒకవేళ ఆధార్‌కు దరఖాస్తు చేసుకుని ఉంటే సంబంధిత పత్రంతో పాటు బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఆర్ధిక సాయం పొందవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.