Pulses Stocks: పప్పుధాన్యాల దిగుమతిదారుల స్టాక్ పరిమితి ఎత్తివేసిన కేంద్రం..హోల్ సేల్ వ్యాపారుల స్టాక్ పరిమితి పెంపు 

Pulses Stocks: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పప్పుధాన్యాల ధరల పెరుగుదలను నియంత్రించింది. ఇప్పుడు పప్పు ధాన్యాల దిగుమతి దారుల నుంచి స్టాక్ పరిమితిని తొలగించింది.

Pulses Stocks: పప్పుధాన్యాల దిగుమతిదారుల స్టాక్ పరిమితి ఎత్తివేసిన కేంద్రం..హోల్ సేల్ వ్యాపారుల స్టాక్ పరిమితి పెంపు 
Pulses Stocks
Follow us
KVD Varma

|

Updated on: Jul 20, 2021 | 3:45 PM

Pulses Stocks: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పప్పుధాన్యాల ధరల పెరుగుదలను నియంత్రించింది. ఇప్పుడు పప్పు ధాన్యాల దిగుమతి దారుల నుంచి స్టాక్ పరిమితిని తొలగించింది. అంతేకాకుండా, మిల్లర్లు, టోకు వ్యాపారులకు కూడా స్టాక్ పరిమితి పెంచింది. పప్పు ధాన్యాలకు రాబోయే రోజుల్లో దాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పప్పు ధాన్యాల రైతులకు ఉపశమనం కలిగిస్తుంది.  ప్రభుత్వం పల్స్ మిల్లర్లు, టోకు వ్యాపారులు, దిగుమతిదారులు నిర్ణయం తీసుకున్న తరువాత కూడా వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్ పోర్టల్‌లో స్టాక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

నియమాలలోమార్పులు ఇవీ..

టోకు వ్యాపారులు: మొత్తం 200 టన్నులకు బదులుగా 500 టన్నుల వరకు స్టాక్ ఉంచుకోవడానికి టోకు వ్యాపారులకు ఇప్పుడు అనుమతి ఇచ్చారు. అయితే, ఒకరకమైన పప్పుధాన్యాన్ని వారు 100 టన్నులకు మించి నిల్వ ఉంచకూడదు.

మిల్లర్లు: గత 6 నెలల్లో మొత్తం ఉత్పత్తిలో 50%  లేదా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం (ఏది ఎక్కువైతే అది)లో ఉంచగలుగుతారు. అంతకుముందు ఉత్పత్తి సామర్థ్యంలో 25% మాత్రమే నిల్వ చేయడానికి అనుమతి ఉండేది.

దిగుమతిదారు: స్టాక్ పరిమితి నుండి పూర్తిగా మినహాయింపు. వారు కోరుకున్నంత స్టాక్ ఉంచవచ్చు.

రాబోయే రోజుల్లో పప్పుధాన్యాలు ఖరీదైనవిగా మారవచ్చని ,ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.  దీనితో, పప్పుధాన్యాల ధరలు రాబోయే రోజుల్లో 5 నుండి 10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది.  కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే పప్పుధాన్యాలు కిలోకు వంద రూపాయలకు పైగా ఉన్నాయి.

పప్పుధాన్యాలు ధరలు ఎందుకు పెరిగాయి:

కరోనా కాలంలో, ప్రజలు కూరగాయలు పొందడంలో ఇబ్బంది పడ్డారు. ఇది కాకుండా, ప్రజలు నాన్-వెజ్ నుండి తమను తాము దూరం చేసుకున్నారు. ప్రోటీన్ కోసం పప్పులను ఆశ్రయించారు. ఇలాంటి కారణాల వల్ల ధరల డిమాండ్ పెరిగింది. ఇది కాకుండా, గతంలో ఇతర దేశాల నుంచి పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేవారు. అయితే, కరోనా కారణంగా అది బాగా తగ్గింది. దాంతో పప్పు ధాన్యాల ధరలు పెరగడానికి కారణం అయింది. అయితే, మన దేశం పప్పు ధాన్యాల ఉత్పత్తి లో అతిపెద్ద దేశం.

స్టాక్ పరిమితి..

కేంద్ర ప్రభుత్వం పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడానికి  2 జూలై 2021 న  స్టాక్ పరిమితి విధించేందుకు  నిర్ణయించుకుంది. అక్టోబర్ 31 వరకు మూంగ్ మినహా అన్ని పప్పుధాన్యాలపై ప్రభుత్వం స్టాక్ పరిమితులు విధించింది. స్టాక్ పరిమితిని విధించడం అంటే, హోల్‌సేల్ లేదా రిటైల్ వ్యాపారులు, మిల్లర్లు మరియు దిగుమతిదారులు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి పప్పుధాన్యాలు లేదా పప్పుధాన్యాల నిల్వను ఉంచలేరు.

జూలై 2 న ప్రభుత్వం రిటైల్ వ్యాపారులకు 5 టన్నులు, టోకు వ్యాపారులు, దిగుమతిదారులకు 200-200 టన్నుల స్టాక్ పరిమితిని విధించింది. దీనిలో ఏదైనా ఒక రకం స్టాక్ 100 టన్నులు మించకూడదు. పల్స్ మిల్లులు మొత్తం వార్షిక సామర్థ్యంలో 25 శాతానికి మించి నిల్వ ఉంచవద్దని ఒక ఉత్తర్వు ఉంది.

Also Read: Banana : అరటి సాగుతో బోలెడు లాభాలు..! ఈ 10 ప్రయోజనాలు కూడా.. తెలుసుకోండి..

OTT: ఒటీటీ సూపర్‌హిట్.. 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న మార్కెట్..మరింత వేగంగా విస్తరణ!