PM Modi: పెరుగుతున్న ధరల దృష్ట్యా రైస్ పై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు..
సామాన్యులకు రైస్ అందుబాటులో తెచ్చేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ గోధుమ పిండి, శనగపప్పు కోవలోనే భారత్ రైస్‌ను డిస్కౌంట్‌లో అందించేందుకు ప్లాన్ చేస్తుంది. అందుకుగాను కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సన్నబియ్యం ధరల కట్టడికి కేంద్రం అడుగులు వేస్తుంది. కేజీకి 25 రూపాయల సబ్సిడీతో భారత్ బ్రాండ్ రైస్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తుంది.

సామాన్యులకు రైస్ అందుబాటులో తెచ్చేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ గోధుమ పిండి, శనగపప్పు కోవలోనే భారత్ రైస్‌ను డిస్కౌంట్‌లో అందించేందుకు ప్లాన్ చేస్తుంది. అందుకుగాను కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సన్నబియ్యం ధరల కట్టడికి కేంద్రం అడుగులు వేస్తుంది. కేజీకి 25 రూపాయల సబ్సిడీతో భారత్ బ్రాండ్ రైస్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. మార్కెట్లో నాణ్యమైన సన్నరకం బియ్యం కేజీ 60 నుంచి 65 పలుకుతుండడంతో .. భారత్ బ్రాండ్ రైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి కేజీకి 25 సబ్సిడీ అందేంచేలా ప్లాన్ చేస్తుంది కేంద్రం. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ (NCCF), కేంద్రీయ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమచారం. భారత్ బ్రాండ్ కింద ఇప్పటికే రూ.60కి శనగపప్పు, రూ.27.50పైసలకి గోధుమ పిండి అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. దేశంలో ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తోంది.
అదేకోవలో బియ్యాన్ని కూడా డిస్కౌంట్ ధరకు విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర గత ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు భారత్ రైస్‌ను తీసుకురానుంది. ఎన్సీసీఎఫ్ (NCCF), నాఫెడ్ (NAFeD) ద్వారా దేశంలోని 2వేల రిటైల్ పాయింట్లలో భారత్ గోధుమ పిండి.. శనగపప్పు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పెరుగుతున్న నిత్యావసర ఆహార పదార్థాల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టింది. బాస్మతియేతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








