PM Modi: ‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
PM Narendra Modi: దేశంలోని మ్యాపింగ్ పాలసీలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం....
PM Narendra Modi: దేశంలోని మ్యాపింగ్ పాలసీలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల స్వదేశీ కంపెనీలకు భారీగా లబ్ది చేకూరుతుందని తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలనే నేపధ్యంలో కేంద్రం తీసుకున్న మరో ముందడుగుగా మోదీ పేర్కొన్నారు.
Our government has taken a decision that will provide a huge impetus to Digital India. Liberalising policies governing the acquisition and production of geospatial data is a massive step in our vision for an Aatmanirbhar Bharat. #mapmakingsimplified https://t.co/ssbPhAeSp1
— Narendra Modi (@narendramodi) February 15, 2021
“మా ప్రభుత్వం డిజిటల్ ఇండియాకు భారీగా ప్రేరణనిచ్చే నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా సముపార్జన, ఉత్పత్తిని నియంత్రించే విధానాలను సరళీకృతం చేయడం వంటివి ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వేస్తున్న మరో ముందడుగు. ఈ సంస్కరణలు వల్ల మన దేశంలోని స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, పరిశోధనా సంస్థలకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయి. అంతేకాకుండా దీని వల్ల ఉపాధికలగడంతో పాటు, ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం అవుతుందని” అని మోదీ ట్వీట్ చేశారు.
These reforms demonstrate our commitment to improving ease of doing business in India by deregulation.#mapmakingsimplified #Freedom2MapIndia
— Narendra Modi (@narendramodi) February 15, 2021
జియో-స్పేషియల్, రిమోట్ సెన్సింగ్ డేటాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దేశంలోని రైతులు మరింత ప్రయోజనాన్ని పొందుతారని ఆయన అన్నారు. “ఈ సంస్కరణలు భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడతాయి” అని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మార్పుల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే వాటిని భారతదేశంలో పరిమితం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల పరిమితం చేయబడిన జియోస్పేషియల్ డేటా ఇప్పుడు భారతదేశంలో ఉచితంగా లభిస్తుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
India’s farmers will also be benefited by leveraging the potential of geo-spatial & remote sensing data. Democratizing data will enable the rise of new technologies & platforms that will drive efficiencies in agriculture and allied sectors. #mapmakingsimplified #Freedom2MapIndia
— Narendra Modi (@narendramodi) February 15, 2021
“ప్రస్తుతం ఉన్న విధానాలు మ్యాపింగ్ పరిశ్రమపై గణనీయమైన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. వాటిని తొలగిస్తూ.. కేంద్రం తాజాగా నూతన మార్పులు అమలులోకి తీసుకొచ్చింది. కాగా, భారతదేశం ఓ మ్యాపింగ్ శక్తిగా ఎదగడం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.