ఏక కాలంలో 110 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

దేశంలోని 110 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల నమోదైన పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ‘‘దేశ వ్యాప్తంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. 19 రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో మంగళవారం ఇవి కొనసాగాయి. ఇటీవల నమోదైన అవినీతి, ఆయుధాల అక్రమ తరలింపు, నేరపూరిత చర్యలకు పాల్పడిన కేసుల విచారణలో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి’’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇటీవల సీబీఐ […]

ఏక కాలంలో 110 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:57 PM

దేశంలోని 110 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇటీవల నమోదైన పలు కేసుల్లో విచారణ నిమిత్తం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ‘‘దేశ వ్యాప్తంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. 19 రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో మంగళవారం ఇవి కొనసాగాయి. ఇటీవల నమోదైన అవినీతి, ఆయుధాల అక్రమ తరలింపు, నేరపూరిత చర్యలకు పాల్పడిన కేసుల విచారణలో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి’’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఇటీవల సీబీఐ 30 కొత్త కేసులను నమోదు చేసిందని ఆయన వివరించారు.

ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ రోజంతా జరిగే అవకాశం ఉందని ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలని ఆ అధికారి మీడియాకు చెప్పారు. కాగా, ఈ వారంలో సీబీఐ జరుపుతున్న రెండో భారీ ఆపరేషన్‌ ఇది. గత మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే విధంగా సీబీఐ అధికారులు బ్యాంకుల మోసాల కేసుల్లో పెద్ద ఎత్తున సోదాలు జరిపారు. నేడు జరుగుతున్న సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.