వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు
హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కన్నుల పండువగా నిర్వహిస్తున్న అమ్మవారి కల్యాణోత్సవాలకు పలువురు ప్రముఖలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే హరీశ్‌రావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో బల్కంపేట ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది.