Car Companies Hopes: కొత్త ఏడాదిలో కార్ల కంపెనీల ఆశలు.. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు
Car Companies Hopes: గత సంవత్సరం కరోనాతో తీవ్ర స్థాయిలో నష్టపోయిన కార్ల కంపెనీలు కొత్త ఏడాదిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాదిలో నష్టాల నుంచి ఈ ఏడాదిలో...
Car Companies Hopes: గత సంవత్సరం కరోనాతో తీవ్ర స్థాయిలో నష్టపోయిన కార్ల కంపెనీలు కొత్త ఏడాదిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాదిలో నష్టాల నుంచి ఈ ఏడాదిలోనైనా గట్టెక్కుదామన్న ఆశలు పెట్టుకున్నాయి. కియా మోటార్స్ ఏపీలోని తన ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు సిద్దమవుతోంది. టాయోటా మరిన్ని మోడ్సల్స్ ను విడుదల చేయబోతోంది. ఇక హ్యుండయ్ మోటార్స్ మరికొన్ని కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు దేశీయ కార్ల కంపెనీలు ఇక విద్యుత్ వాహనాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు పెట్రోల్ బంకుల తరహాలోనే బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. టయోటా కిర్లోస్కర్ మోటారు మధ్య, దీర్ఘ కాలిక వ్యూహం కింద విద్యుత్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనికి తోడు మరిన్ని నగరాల్లో సబ్‌స్ర్కిప్షన్, లీజింగ్ మోడల్ ను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో టాటా మోటార్స్ వాహనాలకు డిమాండ్ ఉత్పత్తిని మించిపోయింది. ఇదే టైమ్ లో కొనుగోలు దారుల్లోను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో టాటా మోటార్స్ తో సహా పలు ఆటోమొబైల్స్ కంపెనీలు ఇప్పుడు భద్రత, సామర్థ్యం, నాణ్యత, సౌకర్యాలకు పెద్ద పీఠ వేస్తున్నాయి.
TS First Compressed Biogas Project: తెలంగాణలో కోళ్ల వ్యర్థాలతో తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభం