గణేష్ చవితి భారీ ఉత్సవాలకు అనుమతివ్వలేం: సుప్రీం
ఈ ఏడాది మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ పెద్ద ఏత్తున ఉత్సవాల నిర్వహణ సరికాదని పేర్కొంది.

ఈ ఏడాది మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ పెద్ద ఏత్తున ఉత్సవాల నిర్వహణ సరికాదని పేర్కొంది. ఉత్సవాల సందర్భంగా జనం భారీగా గుమ్మికూడే అవకాశాలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో అటువంటి అనుమతి ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలు అంటేనే భారీ జనసమూహామని సీజే చెప్పారు. జన ప్రవాహాన్ని అదుపు చేయలేం కాబట్టి.. వినాయకుడి వేడుకలకు అనుమతి ఇవ్వలేమని కోర్టు వెల్లడించింది. జైన ఆలయాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే మహారాష్ట్రలోని దాదర్, చెంబూర్, బైకులా జైన ఆలయాలను తెరిచేందుకు మాత్రం కోర్టు అనుమతినిచ్చింది. కొవిడ్ కు సంబంధించిన పూర్తి నిబంధనల మధ్య ఆలయాలను తెరవాలని పేర్కొంది. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయమని కోర్టు స్పష్టం చేసింది.
