మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు బాడీ కెమెరాలు..!

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సమరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆర్టీసీ బస్సుల్లో అక్రమాలు, ఘర్షణలకు తావుకుండా ఎల్లప్పుడు నిఘా పెట్టేందుకు కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.

  • Balaraju Goud
  • Publish Date - 11:58 am, Mon, 7 December 20
మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు బాడీ కెమెరాలు..!

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సమరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆర్టీసీ బస్సుల్లో అక్రమాలు, ఘర్షణలకు తావుకుండా ఎల్లప్పుడు నిఘా పెట్టేందుకు కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఔరంగాబాద్‌లో సిటీ బస్సుల కండక్టర్లు, టిక్కెట్‌ తనిఖీ అధికారుల చొక్కా జేబులకు కెమెరాలు బిగించనున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న కెమెరాలత మాదిరిగా ఇకపై బస్సు కండక్టర్లు, తనిఖీ అధికారులకు కెమెరాలను ఇవ్వనున్నారు.

కాగా, ప్రయాణికులు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కొన్నిరోజుల క్రితం మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేయడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ కెమెరాల బిగింపు పూర్తిచేస్తామని సిటీ బస్సులు నడిపే ఔరంగాబాద్‌ స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇక్కడి సిటీ బస్సుల లైన్‌ ఇన్‌స్పెక్టర్లుగా మాజీ సైనిక సిబ్బందిని నియమించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై నిఘా నేత్రం అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.