లవ్ జిహాద్‌ వ్యవహరంపై యూపీ సర్కార్ సీరియస్.. మరో కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్

బలవంతపు మతమార్పిడి వివాహాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బలవంతపు మతమార్పిడులతో చేసే వివాహాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సు తీసుకువచ్చిన విషయం విదితమే.

లవ్ జిహాద్‌ వ్యవహరంపై యూపీ సర్కార్ సీరియస్.. మరో కేసు నమోదు.. ఇద్దరి అరెస్ట్
Follow us

|

Updated on: Dec 07, 2020 | 11:43 AM

బలవంతపు మతమార్పిడి వివాహాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బలవంతపు మతమార్పిడులతో చేసే వివాహాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సు తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ చట్టానికి సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ వ్యక్తిని, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేరే మతానికి చెందిన ఓ మహిళతో బలవంతంగా వివాహాన్ని నమోదు చేసేందుకు ఆ వ్యక్తి తన సోదరుడితో కలిసి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. ఇది తెలుసుకున్న భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా సంబంధిత మహిళ తనకు వివాహ వయసు వచ్చిందని, కొద్ది నెలల క్రితం తన ఇష్టంతోనే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించినట్లు చెప్పారు. కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఇలాంటి కేసులకు సంబంధించి ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సీతాపుర్‌లో ఏడుగురిని అరెస్టు చేయడంతో పాటు లక్నోలో మరో వివాహాన్ని కూడా అడ్డుకున్నారు.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..