బడ్జెట్ 2021-పన్నుల వ్యవస్థలో కేంద్రం మార్పులు చేస్తుందా ? ప్రత్యక్ష, పరోక్ష పన్నులంటే ? నిర్మల బడ్జెట్ ఎలా ఉంటుంది?

బడ్జెట్ 2021-పన్నుల వ్యవస్థలో కేంద్రం మార్పులు చేస్తుందా ? ప్రత్యక్ష, పరోక్ష పన్నులంటే ? నిర్మల బడ్జెట్ ఎలా ఉంటుంది?

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించనున్న సందర్భంగా పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తారా..,

Umakanth Rao

| Edited By: Team Veegam

Jan 22, 2021 | 4:38 PM

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటుకు సమర్పించనున్న సందర్భంగా పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తారా, ఇది ఎలా ఉండబోతోంది అన్నది ఆర్థిక నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వ్యవస్థల గురించి ఇప్పుడు ప్త్రస్తావించుకోవలసిన అవసరం ఉంది.

ప్రత్యక్ష పన్నులంటే ?

ఇవి అసెసీలు..వ్యక్తులు లేదా కంపెనీలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.. ఈ లయబిలిటీ ని ఇతర ఏ పన్ను చెల్లింపుదారుకూ బదిలీ చేయడానికి వీలు లేదు. టాక్స్ అథారిటీ దీన్ని నేరుగా విధిస్తుంది. దేశంలో ఇన్ కమ్ టాక్స్, వెల్త్ టాక్స్, కార్పొరేట్ టాక్స్, కేపిటల్ గెయిన్ టాక్స్ ఇలా వేర్వేరు రకాల పన్నుల వ్యవస్థలు ఉన్నాయి. స్లాబుల ప్రకారం వీటిని నిర్దేశించారు.

పరోక్ష పన్నులంటే ?

జీఎస్టీ పరోక్ష పన్నుల వ్యవస్ధకిందికే వస్తోంది. వ్యక్తి ఆదాయంతో గానీ, ఉపాధితోగానీ నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి వెళ్లే సొమ్మే జీఎస్టీ.. ముఖ్యంగా సరకులు, సర్వీసుల ప్రతిపాదికపై 2017 జులైలో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇండియాను ఓ ఉమ్మడి మార్కెట్ గా మార్చేందుకు ఉద్దేశించిన ఈ తరహా పన్నుల విధానాన్నీ నాడు పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దొడ్డిదారిన సామాన్యుడి నడ్డి విరిచేందుకే జీఎస్టీని తెచ్చారని ఆరోపించాయి. అయితే పన్నులను ఎగగొట్టకుండా చూసేందుకు ఈ విధానాన్ని తెచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ను పన్ను చెల్లింపు కోసం 5 వేర్వేరు టాక్స్ స్లాబుల కింద విభజించారు. జీరోపర్సెంట్, 5, 12, 18, 28 శాతం ..ఇలా ! కానీ జీఎస్టీ కింద పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాలిక్ డ్రింకులు, ఎలక్ట్రిసిటీని మినహాయించారు. ఆ యా రాష్ట్రప్రభుత్వాలకే వీటిని వదిలివేశారు.

Read Also:ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu