మణిపూర్‌లో డ్రగ్స్ కలకలం.. రూ. 287 కోట్లు విలువ చేసే 72 కిలోల బ్రౌన్ షుగర్ పట్టివేత
భారత ఈశాన్య సరిహద్దులో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టాయి భద్రతా దళాలు. మణిపూర్‌లో భద్రతా దళాలు రూ. 287 కోట్లు విలువ చేసే 72 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భారత ఈశాన్య సరిహద్దులో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టాయి భద్రతా దళాలు. మణిపూర్‌లో భద్రతా దళాలు రూ. 287 కోట్లు విలువ చేసే 72 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. థౌబల్ జిల్లాలో బుధవారం కాము ప్రాంతంలో అస్పాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ మత్తు పదార్థాలు గుర్తించారు. ఇంత పెద్దఏత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ రవాణా చేస్తున్నారని నిఘా వర్గాల పక్కా సమాచారంతో కొన్ని బృందాలుగా ఏర్పడి గత రెండురోజులగా కూంబింగ్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఒక బృందం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిపిన దాడుల్లో మూడు సంచుల బ్రౌన్ షుగర్‌ను తరలిండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 287 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అంతకుముందు గత నెలలో మోజింగ్ అవాంగ్ లెకాయి ప్రాంతంలో 438.945 కిలోల అనుమానిత డ్రగ్స్‌ను, 438 లీటర్ల మార్ఫినేటేడ్ లిక్విడ్, ఇతర పదార్థాలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 22న లిలాంగ్ ప్రాంతంలో పోలీసులు అక్రమ డ్రగ్స్ ఫ్యాక్టరీని ఛేదించి రూ. 164 కోట్లు విలువ చేసే 41 కిలోల బ్రౌన్ షుగర్‌ని స్వాధీనం చేశారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వాహానాలను పరిశీలిస్తున్నారు. భారీ మొత్తంగా డ్రగ్స్ పట్టుబటడంతో ప్రత్యేక బృందాలు మరిన్ని దాడులు నిర్వహించాలని నిర్ణయించారు.
Security forces seized nearly 72 kg of brown sugar worth over Rs 287 crore in #Manipur’s Thoubal district. (@hemantakrnath) https://t.co/4OM13YPJy6
— IndiaToday (@IndiaToday) November 12, 2020