AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. అసలేం జరిగిందంటే?

ఒక చిన్న మాట.. ఒక భారీ తప్పిదం.. వెరసి గుంటూరు మెడికల్ కాలేజీలో తీవ్ర కలకలానికి దారితీసింది.. మెడికల్ ఎగ్జిబిషన్‌ను ఎంతో ఉత్సాహంగా తిలకిస్తున్న విద్యార్థులు, సందర్శకులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఫీడ్‌బ్యాక్ బోర్డుపై ఒక విద్యార్థి సరదాగా రాసిన బూమ్ అనే పదమే దీనికి కారణం. అసలు ఏం జరిగిందంటే..?

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. అసలేం జరిగిందంటే?
Bomb Scare At Guntur Medical College
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 1:21 PM

Share

గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 4న మంత్రి సత్యకుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మెడికల్ ఎగ్జిబిషన్ కావడంతో విద్యార్ధులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి తిలకిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో విజయవాడకు చెందిన నర్సింగ్ విద్యార్ధులు నలుగురు వచ్చారు. ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత మైక్రోబయోలజీ వద్ద ఏర్పాటు చేసి ఫీడ్ బ్యాక్ బోర్డ్ వద్ద ఆగారు. స్లిప్స్‌పై తమ అభిప్రాయాలను తెలిపి వాటిని బోర్డుపై ఉంచే క్రమంలో ఒక విద్యార్థి బూమ్ అంటూ రాసి బోర్డుపై పెట్టారు. దీన్ని చదవడంలో పొరబడిన ఎగ్జిబిషన్ సిబ్బంది బాంబుగా భావించి హాడావుడి చేశారు. వెంటనే మెడికల్ కాలేజ్ గేట్లు మూసివేశారు. ఎగ్జిబిషన్ నుండి అందరిని బయటకు పంపారు. ఈ క్రమంలోనే ఆ స్లిప్ పెట్టింది ఎవరా అంటూ సిసి కెమెరా విజువల్స్  తీశారు. పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే లోపు ఆ విద్యార్ధులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ విషయంపై మీడియా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ప్రశ్నించారు. బాంబు బెదిరింపు నిజమా..? కాదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియా వ్యక్తులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధ్య వాగ్వివాదం జరిగింది. మరోవైపు పోలీసులు ఆ విద్యార్థులును ప్రశ్నించగా.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం తాము బూమ్ అని రాశామ.. అది బాంబ్ కాదంటూ వివరణ ఇచ్చారు. వాళ్లు రాసిన స్లిప్‌ను పరిశీలించిన పోలీసులు అందులో కూడా బూమ్ అనే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బాంబు వార్త మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.

రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?