సుశాంత్‌ను చంపింది వాళ్లే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..

హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని..

సుశాంత్‌ను చంపింది వాళ్లే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2020 | 10:40 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం అటు అభిమానులను, ఇటు సినీ ప్రముఖులను తీవ్రంగా కలిచి వేస్తోంది. అద్భుతమైన నటుడు, గొప్ప సినిమాలు.. అంతా బాగానే ఉంది. సడన్‌గా ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిలోనూ విషాదం నింపింది. అయితే హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్ళను ఎదగనివ్వరని మండిపడ్డారు. దీనితో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న గుతాధిపత్యం మరోసారి బయటపడింది.

దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియోను పోస్ట్ చేసిన కంగనా బాలీవుడ్ పెద్దలపై విమర్శలు గుప్పించింది. సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది. కానీ అవార్డు రానివ్వకుండా చేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు.? అంటూ ప్రశ్నించింది. ఇదంతా కూడా బాలీవుడ్ బడా సెలబ్రిటీలు పక్కా ప్లాన్ ప్రకారం చేసిందే. వారు కొత్తగా వచ్చేవారిని ప్రోత్యహించకపోగా వెనక్కి లాగుతారు. బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్‌ను తొక్కేస్తారు. సుశాంత్‌ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరి సంజయ్ దత్ గురించి బాలీవుడ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు. ఒకానొక సమయంలో తన సినిమాలను చూడమని సుశాంత్ అభిమానులను విజ్ఞప్తి చేశాడు. తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటికి తోసేస్తారని వాపోయాడని కంగనా రనౌత్ తెలిపారు. ఆఖరికి నాపైనా కూడా ఆరు కేసులు బనాయించారు కంగనా చెప్పారు. బాలీవుడ్ పెద్దలు పెట్టిన స్ట్రెస్‌ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా మండిపడ్డారు.

కాగా, సుశాంత్ చనిపోయిన తర్వాత కరణ్ జోహార్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నీతో గత ఏడాది కాలంగా సన్నిహితంగా ఉండటం లేదని.. మానవ సంబంధాలను పెంచుకోకుండా తప్పు చేసానని.. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని కరణ్ జోహార్  ట్వీట్ చేశాడు. దీనికి ఓ అభిమాని ‘బాలీవుడ్ పెద్దలెవ్వరూ కూడా తనకు తోడుగా లేరని.. పార్టీలకు, ఫంక్షన్స్‌కు పిలవలేదని గతంలో సుశాంత్ వాపోయిన ఓ ట్వీట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనితో నెటిజన్లు సుశాంత్ ఆత్మహత్య విషయంలో అలియా భట్, నిర్మాత కరణ్ జోహార్‌లకు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ఒక వ్యక్తి మీ మధ్య ఉన్నప్పుడు ఆదరించడం మానేసి, ఫ్యామిలీలా చూడకుండా, పార్టీలకు పిలవకుండా, దూరం పెట్టి.. చనిపోయిన తర్వాత అంతా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారా’ అంటూ నెటిజన్లు సీరియస్ అయ్యారు. ఇంకెన్నాళ్ళు ఇండస్ట్రీలో వారసత్వం రాజ్యమేలాలని మండిపడుతున్నారు.