నేడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న 48 మంది బీజేపీ కార్పొరేటర్లు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్నారు...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్నారు కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ కార్పొరేటర్లు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మీ అమ్మవారికి కొత్త కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాఉంటే, త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల స్ఫూర్తితో 2023లో బీజేపీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటామన్న బండి.. . మేయర్ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.