ఫేస్‌బుక్‌కి సమన్లు ! థరూర్ నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ ఎంపీలు
ఫేస్‌బుక్ దుమారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి ఫేస్‌బుక్ అనైతిక మద్దతు పలికినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫేస్‌బుక్ దుమారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి ఫేస్‌బుక్ అనైతిక మద్దతు పలికినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల హక్కుల రక్షణ, ఆన్‌లైన్ మీడియా దుర్వినియోగం అంశంలో ఎంపీల ప్యానెల్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేయాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వెల్లడించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటి ఛైర్మన్‌గా శశిథరూర్ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తమ కమిటీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేయనున్నట్లు ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.
దీన్ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్రంగా ఖండించారు. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా ఎంపీ శశిథరూర్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేయలేరనీ చెప్పారు. దీనిపై ఆయన సహచర ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే శశిథరూర్‌కు.. తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మద్దతుగా నిలిచారు. మరోవైపు శశిథరూర్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలంతా స్పీకర్‌కు లేఖ రాయాలని దూబే కోరారు. పార్లమెంటరీ ప్యానెల్‌ను రాజకీయ వేదికగా మార్చవద్దు అని వ్యాఖ్యానించారు.
Also Read:
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !
షాకింగ్ సర్వే : సాత్ ఇండియాలో 94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదు




