షాకింగ్ స‌ర్వే : సాత్ ఇండియాలో 94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదు

సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది స్టూడెంట్స్‌ ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి అవ‌ర‌మైన‌ స్మార్ట్‌ ఫోన్లు లేవు.

షాకింగ్ స‌ర్వే : సాత్ ఇండియాలో  94% మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోనే లేదు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 11:55 AM

సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది స్టూడెంట్స్‌ ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడానికి అవ‌ర‌మైన‌ స్మార్ట్‌ ఫోన్లు లేవు. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో లేదు. ఇటీవ‌ల‌ బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. మే-జూన్‌ నెలల్లో 11-18 సంవత్సరాల మధ్య ఉండే 5,987 స్టూడెంట్స్‌తో స‌ద‌రు సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో స్కూల్స్‌ మూతపడిన నేపథ్యంలో గ్రౌండ్ లెవ‌ల్‌లో ఆన్‌లైన్‌ విద్య ఎంత మందికి అందుబాటులో ఉందో.. తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే చేప‌ట్టింది.

సర్వేలో దక్షిణ భారతంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పరిస్థితే కాస్త బెట‌ర్‌గా ఉంది. ఆ రాష్ట్రం నుంచి స్పందించిన 1145 మంది స్టూడెంట్స్‌లో తొమ్మిది శాతం మందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. తమిళనాడులో అత్యల్పంగా మూడు శాతం మంది మాత్ర‌మే ఫోన్లు క‌లిగి ఉన్నారు. ఈ స‌ర్వే ద్వారా మ‌రో కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సర్వే చేసిన స్టూడెంట్స్ ఫ్యామిలీల‌లో 95 శాతం మంది వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువే. వ‌చ్చే అరకొర ఆదాయంతో వారు స్మార్ట్‌ఫోన్‌ కొనడం.. పిల్లలను ఆన్‌లైన్ విద్య అందించ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం అని స‌ర్వే పేర్కొంది.

Also Read :

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా !

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

పెను విషాదం : పడవ బోల్తా పడి ఒకే కుటుంబంలోని 10 మంది మృతి