రాజధాని ఉద్యమబరిలోకి జనసేన-బీజేపీ
నెలన్నర రోజులుగా రగులుతున్న అమరావతి రాజధాని ఆందోళనలో భాగస్తులయ్యేందుకు కొత్తగా జతకట్టిన బీజేపీ, జనసేన పార్టీలు ముహూర్తం ఖరారు చేశాయి. తాజా సమాచారం ప్రకారం రెండు పార్టీల నేతలు ఆదివారం అమరావతి ఏరియాలోని గ్రామాల్లో పర్యటించి, ఆందోళన కొనసాగిస్తున్న వారికి సంఘీభావం ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అసెంబ్లీలో రాజధాని బిల్లు వచ్చిన రోజున అమరావతి ఏరియాలో పర్యిటించేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సంగతి తెలసిందే. ఆ తర్వాత బీజేపీతో కుదిరిన కొత్త […]
నెలన్నర రోజులుగా రగులుతున్న అమరావతి రాజధాని ఆందోళనలో భాగస్తులయ్యేందుకు కొత్తగా జతకట్టిన బీజేపీ, జనసేన పార్టీలు ముహూర్తం ఖరారు చేశాయి. తాజా సమాచారం ప్రకారం రెండు పార్టీల నేతలు ఆదివారం అమరావతి ఏరియాలోని గ్రామాల్లో పర్యటించి, ఆందోళన కొనసాగిస్తున్న వారికి సంఘీభావం ప్రకటించేందుకు రెడీ అయ్యారు.
అసెంబ్లీలో రాజధాని బిల్లు వచ్చిన రోజున అమరావతి ఏరియాలో పర్యిటించేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్న సంగతి తెలసిందే. ఆ తర్వాత బీజేపీతో కుదిరిన కొత్త స్నేహంతో రాజధాని ఆందోళనకు ఇరు పార్టీలు సంసిద్దమయ్యాయి. ఈలోగా రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ఖరారుపై ఇరుపార్టీల నేతలు కలిసి పలు దఫాలుగా భేటీ అయ్యారు.
తొలి కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రజలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించడంగా ఖరారు చేశారు. అందులో భాగంగానే ఆదివారం రెండు పార్టీల నుంచి చెరో ఆరుగురు నేతల చొప్పున బృందంగా ఏర్పడి అమరావతి ఏరియాలోని గ్రామాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేశారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో మిత్ర పక్షాల బృందం పర్యటించబోతోందని తెలిపారు. ఏక నిర్ణయంతో ముందుకు పోతామంటుని అందులో భాగమే ఈ రాజధాని పర్యటన అని బీజేపీ-జనసేన వర్గాలంటున్నాయి.