నిర్మలమ్మ బడ్జెట్.. ఎవరు ‘విన్నర్’? ఎవరు ‘లూజర్’ ?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్.. పరోక్షంగా ప్రజలపై ‘ దొంగదెబ్బ ‘ కొట్టినట్టే ఉంది. ‘తియ్యదనం పాళ్ళు’ గానీ, తాయిలాల ఊసు గానీ లేక పేదలు, మధ్యాదాయవర్గాలను ఉసూరుమనిపించేలా ఉంది. భారీ కేటాయింపులు లేకపోవడం, ముఖ్యంగా  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడమే గాక, ప్రధాన ప్రాజెక్టులకు నిధుల విషయం గురించిన ప్రస్తావనే లేదు. బడ్జెట్ ప్రభావంతో దలాల్ స్ట్రీట్ బేర్ మంది. ‘ బడ్జెట్ బ్లీడ్ 900 పాయింట్స్’ […]

నిర్మలమ్మ బడ్జెట్.. ఎవరు 'విన్నర్'? ఎవరు 'లూజర్' ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 01, 2020 | 5:21 PM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్.. పరోక్షంగా ప్రజలపై ‘ దొంగదెబ్బ ‘ కొట్టినట్టే ఉంది. ‘తియ్యదనం పాళ్ళు’ గానీ, తాయిలాల ఊసు గానీ లేక పేదలు, మధ్యాదాయవర్గాలను ఉసూరుమనిపించేలా ఉంది. భారీ కేటాయింపులు లేకపోవడం, ముఖ్యంగా  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడమే గాక, ప్రధాన ప్రాజెక్టులకు నిధుల విషయం గురించిన ప్రస్తావనే లేదు. బడ్జెట్ ప్రభావంతో దలాల్ స్ట్రీట్ బేర్ మంది. ‘ బడ్జెట్ బ్లీడ్ 900 పాయింట్స్’ అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సెన్సెక్స్ 850 పాయింట్లకు పడిపోగా.. నిఫ్టీ పరిస్థితి కూడా దాదాపు అదే !ఆర్ధిక ద్రవ్యలోటు ప్రస్తావన లేకుండా ఆర్ధికమంత్రి జాగ్రత్త పడ్డారు. రక్షణ, ఉత్పాదక వంటి కీలకరంగాలకు కేటాయింపుల విషయాన్ని ఆమె మరిచినట్టున్నారు. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన చర్యలవల్ల ఎవరు విన్నర్, ఎవరు లూజర్ అని విశ్లేషిస్తే.. విన్ అయిన బడా సంస్థలే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. ‘ భారత్ నెట్’ పథకం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ ఎఫ్ సి ఎల్ వంటి సంస్థలు . పరిశుధ్ధ ఇండియా  పథకం వల్ల హెచ్ యు ఎల్, ఐటీసీ, గోద్రెజ్ లాంటి సంస్థలు, పరిశుభ్ర నీటిని అందిస్తామన్న ప్రకటన కారణంగా కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ వంటివి లాభపడనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిస్తున్నట్టు ఆమె ఇఛ్చిన హామీ.. మొబైల్ ఫోన్లు, సెమి కండక్టర్లు, మెడికల్ పరికరాలను  ఉత్పత్తి చేస్తున్న డిక్సన్ టెక్నాలజీస్, యాంబర్ ఎంటర్ ప్రైసెస్ వంటి బడా మ్యాన్యుఫాక్చరర్లు ప్రయోజనం పొందనున్నారు. ట్రాన్స్ పోర్ట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాలకోసం, హైవేల అభివృధ్ది కోసం భారీ కేటాయింపులు జరిపిన ఫలితంగా లార్సెన్ అండ్ టూబ్రో, కె ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్స్ లాభ పడతాయని అంటున్నారు.

మత్స్య కారుల ప్రయోజనం కోసం ‘ సాగర్ మిత్ర’ పథకాన్ని నిర్మల ప్రకటించారు. దీనివల్ల అవంతి సీడ్స్, ఎపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ వాటర్ బేస్ ప్రయోజనం పొందనున్నాయి. రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ ఫ్రెయిట్ కార్స్ వంటివి ఇక  అందుబాటు లోకి వస్తాయని ఆమె  అన్నారు. దీంతో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభపడితే.. రైతులకోసం సోలార్ పైపుల పంపిణీ కారణంగా శక్తి పంప్స్ ఇండియా  సేల్స్ పెరుగుతాయి. క్లీన్ ఇండియా మిషన్ వల్లహిందుస్థానీ యూని లీవర్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, గోద్రెజ్ షేర్స్ పెరగడం ఖాయమని అంటున్నారు. భారత్ నెట్ పథకం కారణంగా భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్, డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుతో టీసీఎస్,  ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర, అదానీ ఎంటర్ ప్రైసెస్ షేర్లు నింగిని అంటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఇక లూజర్స్ విషయానికే వస్తే.. ఎల్ఐసీలో కొంత వాటాను విక్రయించాలన్న యోచన వల్ల ఈ సంస్థ షేర్లు అప్పుడే తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెట్టుబడులపై ఆర్ధిక మంత్రి పెద్దగా ముఖ్యమైన ప్రకటనేదీ చేయలేదు. ఫలితంగా ఎస్ బీ ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా,కెనరా బ్యాంక్ వంటివి ఉసూరుమన్నాయి.  నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న బ్యాంకుల రుణ సామర్థ్యాన్నిఎలా పెంచుతామన్న ప్రస్తావన అసలు లేకపోయింది.  రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పెద్ద తాయిలాలు లేవు.. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియాలిటీ లిమిటెడ్, డీ ఎల్ ఎఫ్, ప్రిస్టేజ్ ఎస్టేట్స్ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థల షేర్లు క్షీణించాయి. మధ్యతరగతి వర్గాల సొంత ఇంటి కలలను నిజం చేసేందుకు ఈ బడ్జెట్ పెద్దగా ఊతమిచ్చిన సూచన కనిపించదు. వచ్ఛే ఐదేళ్లలో ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువఛ్చి ఈ వ్యవస్థను ఉజ్వలంగా పునరుజ్జీవింపజేస్తామని గత బడ్జెట్లో ఆర్భాటంగా హామీ ఇఛ్చిన నిర్మలా సీతారామన్ గళంలో… ఈ సారి ఆ  ‘గట్టిదనం’ కనిపించలేదు. ఆ ధీమా లేకపోయింది. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కొంటామన్న ప్రకటనగానీ, ఖాయిలా పడుతున్న ఆటోమొబైల్, ఇతర పరిశ్రమలను ఎలా ఆదుకుంటామన్న హామీలు గానీ ఈ బడ్జెట్లో కరువయ్యాయి. అలాగే ద్రవ్యోల్బణం అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానం లేదు. రెండున్నర గంటలకు పైగా ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చేసి.. చివరకు కొంత అస్వస్థతతో మధ్యలోనే ఆ ప్రసంగాన్ని ముగించి నిష్క్రమించారు.

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.