ఎకనమిక్ సర్వే .. వృద్ది రేటు పెరుగుదలే టార్గెట్ !
2011 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ది రేటు 6 నుంచి 6.5 శాతం ఉంటుందనిఎకనమిక్ సర్వే అంచనా వేసింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతం ఉన్న విషయాన్ని ఈ సర్వే పేర్కొంది. (ఇది 11 ఏళ్లలో అతి ‘ స్లో ‘ గా జరిగిన ‘ ప్రక్రియ’ గా ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు). ఈ వృద్ది రేటు 9 శాతం ఉంటుందని గత ఏడాది జులైలో అంచనా వేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ […]
2011 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ది రేటు 6 నుంచి 6.5 శాతం ఉంటుందనిఎకనమిక్ సర్వే అంచనా వేసింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతం ఉన్న విషయాన్ని ఈ సర్వే పేర్కొంది. (ఇది 11 ఏళ్లలో అతి ‘ స్లో ‘ గా జరిగిన ‘ ప్రక్రియ’ గా ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు). ఈ వృద్ది రేటు 9 శాతం ఉంటుందని గత ఏడాది జులైలో అంచనా వేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ ఎకనమిక్ సర్వే ను ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వార్షిక ఆర్ధిక వృద్ది రేటు 4.5 శాతానికి దిగజారింది. కీలక రంగాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సంస్కరణలను గతంలో కన్నా ఇంకా వేగంగా అమలుపరచవలసి ఉందని, రిజర్వ్ బ్యాంకు ఇటీవల తీసుకున్న కొన్ని చర్యలు పెద్దగా సహాయపడలేదని ఈ సర్వే అభిప్రాయపడింది.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్ ను శనివారం పార్లమెంటుకు సమర్పించనున్న నేపథ్యంలో.. ఆర్థిక వృద్దికి అనుగుణంగా తీసుకోవలసిన, తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించనున్నారు. వేతన జీవులకు పన్ను రాయితీలు ఈ బడ్జెట్లో ప్రధాన అంశం కావచ్ఛు. అలాగే గత ఏడాది కార్పొరేట్ పన్నుల్లో కోత నిర్ణయ ప్రభావంతో బాటు ఇక ఇన్ ఫ్రా స్ట్రక్చర్ రంగంలో పెట్టుబడుల పెంపు, ఉత్పాదక రంగానికి మరింత ప్రాధాన్యం వంటివి కీలకమైనవి. లేబర్ ఉపాధికి ఊతమిచ్ఛే ఇతర రంగాలకు కూడా ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయవచ్ఛు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు, అలాగే వీటిలో సృష్టించిన వెల్త్ డేటాను మరింతగా వినియోగించేందుకు కృత్రిమ మేధస్సును కూడా వాడుకునే అంశానికి ప్రాధాన్యమిస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది.