పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టీడీపీ ఆఫీస్ అవుట్!

పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టీడీపీ ఆఫీస్ అవుట్ అవ్వగా, వైసీపీ కార్యాలయం అక్కడికి చేరింది. 30 ఏళ్లుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌‌లోనే టీడీపీ కార్యాలయం 5వ నెంబర్ గదిలో కొనసాగుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించారు స్పీకర్. అటు టీడీపీ సంఖ్యాబలం తగ్గడంతో మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి ఆ కార్యాలయాన్ని తరలించారు. మూడు నెలల కిందటే వైసీపీకి 5వ నెంబర్ […]

పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టీడీపీ ఆఫీస్ అవుట్!

పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టీడీపీ ఆఫీస్ అవుట్ అవ్వగా, వైసీపీ కార్యాలయం అక్కడికి చేరింది. 30 ఏళ్లుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌‌లోనే టీడీపీ కార్యాలయం 5వ నెంబర్ గదిలో కొనసాగుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలవడంతో ఆ కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించారు స్పీకర్. అటు టీడీపీ సంఖ్యాబలం తగ్గడంతో మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి ఆ కార్యాలయాన్ని తరలించారు. మూడు నెలల కిందటే వైసీపీకి 5వ నెంబర్ గది కేటాయించినా.. టీడీపీ ఖాళీ చేయకపోవడంతో.. ఆ పార్టీపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి స్పీకర్‌కి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పీకర్.. టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు.

Published On - 4:08 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu