మహేష్ సినిమాలో విజయ్ దేవరకొండ!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరో విజయ్ దేవర కొండ కనిపించనున్నాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ.. సంక్రాంతికి రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత రెండో సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మహేష్‌తో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా కనిపించనున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. […]

మహేష్ సినిమాలో విజయ్ దేవరకొండ!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరో విజయ్ దేవర కొండ కనిపించనున్నాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ.. సంక్రాంతికి రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత రెండో సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మహేష్‌తో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా కనిపించనున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కాగా.. కొద్దిరోజుల్లోనే మహేష్ న్యూ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది జేమ్స్‌బాండ్ సినిమా తరహాలోనే ఉండబోతోందని కూడా వెల్లడించారు. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేష్.. ఈ సినిమాపై కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కాగా.. వంశీ సినిమాలో మహేష్ స్పై క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇందులో రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ కూడా మహేష్‌తో కలిసి తెరను పంచుకోబోతున్నాడట. అలాగని.. మూవీ మొత్తం విజయ్ ఉండడు. కొద్ది నిమిషాలు మాత్రమే.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడట. అయినా ఆ పాత్ర ప్రధానాకర్షనగా నిలవనుందట. మరి ఇందులో నిజమెంతో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Published On - 3:38 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu