ఆ విషయంలో కరోనావైరసే బెటర్

కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్‌ వైరస్‌లు చాలానే ఉన్నాయి.. అంతెందుకు ఈ మధ్యనే అమెరికాలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది… ఇందులో ఓ 60 మంది చిన్నారులున్నారు. ఓ పదిహేను లక్షల మందిని ఈ ఇన్‌ఫ్లుయెంజా […]

ఆ విషయంలో కరోనావైరసే బెటర్
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 01, 2020 | 4:42 PM

కరోనా పిశాచం ప్రపంచదేశాలను వణికిస్తోంది… ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వందలాది మంది మరణించారు.. వేలాది మంది బాధపడుతున్నారు..కొందరు అంతిమఘడియలను లెక్కపెట్టుకుంటున్నారు.. అడ్డదిడ్డమైన వైరస్‌లను పుట్టించడం… వాటిని ప్రపంచదేశాలమీద వదిలేయడం చైనావోడికి బాగా అలవాటైందని తిట్టుకుంటున్నాం కానీ.. ఇంతకంటే డేంజర్‌ వైరస్‌లు చాలానే ఉన్నాయి.. అంతెందుకు ఈ మధ్యనే అమెరికాలో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది… ఇందులో ఓ 60 మంది చిన్నారులున్నారు. ఓ పదిహేను లక్షల మందిని ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ పట్టి పీడించిందట! దీన్నే హెచ్‌1 ఎన్‌1 అంటారు.. లక్షన్నరమంది ప్రాణం మీదతీపితో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారట!

ఇదేదో అమెరికా అంటే పడనివాళ్లు చెప్పిన మాట కాదు.. సాక్షాత్తు అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ చెప్పిన సత్యం…అంతమంది ప్రాణాలను తీసుకున్నా ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ఇంకా దాహం తీరలేదు.. మరిన్ని ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నది… ఇప్పుడీ కరోనా ఒకటి దానికి తోడైంది… ఈ రెండూ కలిస్తే పరిస్థితి బీభత్స భయానకమే!

చాలా విషయాలను అమెరికా బయటకు పొక్కనివ్వకుండా దాచేస్తుంది… అగ్రరాజ్యం పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటివి అస్సలు బయటపడనివ్వదు.. అమెరికాలో రోగాలు రొచ్చులు ఉండవనుకుంటాం కానీ అక్కడా ఉంటాయి.. అమెరికా జనానికి ఈ ఫ్లూ వైరస్‌ కొత్తేమీ కాదు.. వైరస్‌ దెబ్బను అనుభవించింది.. అల్లాడిపోయింది.. ఏటా కొన్ని వేల మంది ప్రాణాలను ఈ వైరస్‌ అవలీలగా మింగేస్తుంటుంది.. అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం.. మెడికల్‌ క్యాంపులు పెట్టడం వల్ల కేసుల సంఖ్య కాసింత తగ్గింది..

2017-18లో అయితే నాలుగున్నర కోట్ల మంది ఫ్లూ జ్వరంతో నరకయాతన అనుభవించారు.. ఇందులో 61 వేల మంది చనిపోయారు.. లాస్ట్‌ సీజన్‌లో కోటి 70 లక్షల మంది ఫ్లూ బారిన పడి మందులు మాకులు మింగారు.. అవి కూడా పని చేయక ఓ 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చెబుతున్నదేమిటంటే అక్కడ సంవత్సరానికి 12 వేల నుంచి 64 వేల మంది ఫ్లూ వైరస్‌తో చనిపోతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది హరీమంటున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసి మరీ చెబుతోంది.. ఈ లెక్కన కరోనా వైరస్‌ ఏపాటిది..?

జనరల్‌గా చాలామంది ఫ్లూను లైట్‌ తీసుకుంటారు.. ఫ్లూనే కదా అని నెగ్లెట్‌ చేస్తారు.. ఫ్లూ సోకడం.. దాంతో పాటు మరో ఇన్‌ఫెక్షన్‌ రావడం అంటూ జరిగిందా..? అంతే ..! ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం.. న్యూమోనియా రావచ్చు.. మెదడువాపు వ్యాధి రావచ్చు…మరేదైనా జరగొచ్చు… కొనిసందర్భాలలో శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయనూ వచ్చు.. అప్పుడా రోగి పడే అవస్థల కంటే ప్రాణం పోవడమే మంచిదనిపిస్తుంది…హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ను అంతం చేసే మందే లేదా..? అంటే ఉంది కానీ.. ఆ వైరస్‌ ఎప్పటికప్పుడు తనను తాను మార్చేసుకుంటూ వస్తోంది.. ఏడాదికేడాది బలోపేతం అవుతూ వస్తోంది… అందుకే ఎప్పటికప్పుడు మందులను అప్‌గ్రేడ్‌ చేసుకురావలసి వస్తోంది… ఇప్పుడనిపిస్తుంది కదూ.. కరోనానే కాసింత బెటరని..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..