వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా 100 రోజులపాటు నడ్డా పర్యటన!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జయకేతనం ఎగరవేయడమే టార్గెట్‌గా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 100 రోజులపాటు పర్యటించేందుకు....
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జయకేతనం ఎగరవేయడమే టార్గెట్‌గా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 100 రోజులపాటు పర్యటించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సన్నాహాలు ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన టార్గెట్‌గా నడ్డా యాత్ర సాగనుంది. ఈ ప్రయాణంలో మూడోవంతు సమయం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనే సాగనుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయా రాష్ట్రాల బీజేపీ నాయకులతో నడ్డా కీలక అంశాలు చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమి సభ్య పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం ఉంది.
రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికంగా 8 రోజుల పాటు నడ్డా పర్యటించనున్నారట. నడ్డా యాత్ర సందర్భంగా రాష్ట్రాలను 3 విభాగాలుగా పార్టీ డివైడ్ చేసింది. దాని ప్రకారం ‘ఏ’ జాబితాలో బీజేపీ రూలింగ్‌లో ఉన్న రాష్ట్రాలు, ‘బి’ జాబితాలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ‘సి’ జాబితాలో చిన్న రాష్ట్రాలు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఉంటాయి. నడ్డా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి. కరోనా నేపథ్యంలో ఏ మీటింగ్ హాల్‌లోనూ 200 మందికి మించి ప్రజలు ఉండొద్దని పార్టీ వర్గాలు సూచించాయి. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో నడ్డా సమావేశం కానున్నట్లు తెలిపాయి. ఈ సందర్భంగా బహిరంగ, విలేకరుల సమావేశాల్లో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాాయి.
Also Read :
స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !