రైతుల ఆగ్రహానికి పరాకాష్ట, హర్యానా స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జేజేపీ కూటమికి దెబ్బ ! కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు హర్యానా స్థానిక ఎన్నికల్లో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కి చెంప దెబ్బ కొట్టారు.

రైతుల ఆగ్రహానికి పరాకాష్ట, హర్యానా స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జేజేపీ కూటమికి దెబ్బ ! కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 30, 2020 | 6:31 PM

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు హర్యానా స్థానిక ఎన్నికల్లో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కి చెంప దెబ్బ కొట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కూటమిని దెబ్బ తీశారు.  సోనీపట్, అంబాలాలో ఈ కూటమి మేయర్ పదవులను కోల్పోయింది. ఈ ఎన్నికలను ఈ కూటమి ప్రతిష్టాత్మకమైనవిగా భావించింది. డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ.. ఆయన సొంత జిల్లాలోనే నష్టాన్ని చవి చూసింది. అంబాలా, పంచకుల, సోనీపట్, ధరుహేరా, రోహ్తక్ లోని సంప్లా, హిస్సార్ లోని ఉక్లానా ల స్థానిక ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఓట్ల ను బుధవారం లెక్కించారు. సోనీపట్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ 14 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుచుకుంది. ఇక్కడ ఈ పార్టీకి 72,111 ఓట్లు రాగా-బీజేపీ 58,300 ఓట్లు దక్కించుకుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు బోర్డర్ సమీపంలోనే సోనీపట్ ఉంది.

అంబాలాలో హర్యానా జనచేతన  పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ మేయర్ కానున్నారు. ఈమె మాజీ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ భార్య. ఇక హర్యానాలో బీజేపీ-జేజేపీ నేతలను తమ గ్రామాల్లోకి రానివ్వరాదని పలుగ్రామాలవాసులు నిర్ణయించుకున్నారు. గత నెలలో ఢిల్లీకి వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువును ప్రయోగించారు, వాటర్ క్యానన్లను వినియోగించారు. దీంతో నాడే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీవ్ర విమర్శలనెదుర్కొంది.

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..