బీహార్ ఎన్నికలు, 15 మంది జేడీ-యూ నేతల బహిష్కరణ
బీహార్ ఎన్నికలు ముంచుకొస్తుండగా పాలక జేడీ-యూలో ముసలం మొదలవుతోంది. అసమ్మతి గళం విప్పుతున్నందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 15 మంది నేతలను ఈ పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. బీజేపీ కూడా తొమ్మిది మంది నాయకులపై ఇలాంటి చర్యే తీసుకుంది. ఎన్నికల్లో జేడీ-యూ, బీజేపీ కూటమి అప్పుడే ఇలాంటి ‘కష్టాలను’ ఎదుర్కొంటోంది. బహిష్కరించిన జేడీ-యూ నాయకుల్లో ఒకప్పుడు ఈ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ కి సన్నిహితులైనవారూ ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసన […]
బీహార్ ఎన్నికలు ముంచుకొస్తుండగా పాలక జేడీ-యూలో ముసలం మొదలవుతోంది. అసమ్మతి గళం విప్పుతున్నందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 15 మంది నేతలను ఈ పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. బీజేపీ కూడా తొమ్మిది మంది నాయకులపై ఇలాంటి చర్యే తీసుకుంది. ఎన్నికల్లో జేడీ-యూ, బీజేపీ కూటమి అప్పుడే ఇలాంటి ‘కష్టాలను’ ఎదుర్కొంటోంది. బహిష్కరించిన జేడీ-యూ నాయకుల్లో ఒకప్పుడు ఈ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ కి సన్నిహితులైనవారూ ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసన సభ మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 1065 అభ్యర్థులు రంగంలో మిగిలారని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసు వర్గాలు తెలిపాయి. 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు పేర్కొన్నాయి. తొలి దశలో 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది.