ఎంఐఎం ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. ప్రమాణపత్రంలో హిందూస్థాన్ పదాన్ని తొలగించాలని డిమాండ్..

బీహార్ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సభ్యుడి ప్రమాణపత్రంలో భారతదేశం పేరు మార్చాటంటూ డిమాండ్ చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. ప్రమాణపత్రంలో హిందూస్థాన్ పదాన్ని తొలగించాలని డిమాండ్..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2020 | 10:45 PM

బీహార్ రాష్ట్రానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సభ్యుడి ప్రమాణపత్రంలో భారతదేశం పేరు మార్చాటంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉర్దూ డ్రాఫ్ట్‌లో ఉన్న హిందూస్థాన్ పదాన్ని తొలగించి భారత్ అని చేర్చమని అడగడం వివాదాస్పదమైంది. ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడైన అఖ్తరుల్ ప్రమాణ స్వీకారానికి వచ్చీ రావడంతోనే ఈ డిమాండ్ చేశారు. అఖ్తరుల్ డిమాండ్‌తో విస్మయానికి గురైన ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంఝీ స్పందిస్తూ.. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసేవారు తప్పకుండా హిందూస్థాన్ అనే చెప్పాలన్నారు. అయితే, చివరికి ‘భారత్’ అనే పదాన్ని ఉపయోగించేందుకు స్పీకర్ అనుమతించారు. దీంతో అఖ్తర్ భారత్ అంటూ ప్రమాణం చేశారు.

కాగా, అఖ్తర్ వ్యాఖ్యలు దుమారం రేగడంతో వివరణ ఇచ్చుకున్నారు అఖ్తర్ ఇమాన్. హిందూస్థాన్ అనే పదాన్ని తాను ఎందుకు తొలగించమన్నదీ ఇమాన్ వివరణ ఇస్తూ.. హిందూస్థాన్ పదంతో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తాను ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని చెప్పారు. రాజ్యాంగం ఉపోద్ఘాతం చదివినప్పుడల్లా ఏ భాషలోనైనా అది ‘భారత్’ అనే పదాన్ని ప్రస్తావిస్తుందని మాత్రమే తాను చెప్పానని పేర్కొన్నారు. రాజ్యాంగం పేరిట ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అదే సరైన పదమని భావించానని ఇమాన్ చెప్పుకొచ్చారు.