AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్‌లో 1,122 మంది అభ్యర్థులు… 150 స్థానాల్లో పోటీ చేసింది మాత్రం ఒకే ఒక్క పార్టీ..

గ్రేటర్‌లో 150 వార్డుల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి లోకేష్​ కుమార్​ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ మాత్రమే పోటీ చేస్తోందని ప్రకటించారు.

గ్రేటర్‌లో 1,122 మంది అభ్యర్థులు... 150 స్థానాల్లో పోటీ చేసింది మాత్రం ఒకే ఒక్క పార్టీ..
Sanjay Kasula
|

Updated on: Nov 23, 2020 | 10:29 PM

Share

గ్రేటర్ హైదరాబాద్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి వరకు అన్ని పార్టీ ఆఫీసుల ముందు బీ ఫార్మ్‌ల కోసం కుస్తీ పట్టిన నేతలకు.. ఆ అవకాశాలు కూడా ముగిసాయి. తాజాగా గ్రేటర్‌లో 150 వార్డుల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి లోకేష్​ కుమార్​ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ మాత్రమే పోటీ చేస్తోందని ప్రకటించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్​లోని మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా  టీఆర్ఎస్ పార్టీ నిలిచింది.

ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలిపింది. నవాబ్​సాహెబ్ కుంట డివిజన్​లో తప్ప 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దించింది. కాంగ్రెస్ 146 స్థానాలు, ఎంఐఎం 51 స్థానాలు, టీడీపీ 106 స్థానాలు, సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 డివిజన్లలో అభ్యర్థులు రంగంలోకి దింపింది.

మరో 76 మంది వివిధ గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 415 మంది కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక అత్యధికంగా జంగ్గంమెట్​ డివిజన్​లో 20 మంది అభ్యర్థులు తలపడున్నారు. అత్యల్పంగా 5 డివిజన్లలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్​ సాహెబ్​కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీలో కొనసాగుతున్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!