Bigg Boss Telugu 4 : ‘బిగ్ బాస్ విజేత అభిజీత్’..బలంగా చెబుతోన్న టాలీవుడ్ సీనియర్ హీరో..మీరేమంటారు?

బిగ్‌బాస్ సీజన్ 4 ఎండింగ్ దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వీక్షకుల ఫోకస్ మరింత పెరిగింది. తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేయించేందుకు తెగ ప్రచారాలు చేస్తున్నారు.

Bigg Boss Telugu 4 : 'బిగ్ బాస్ విజేత అభిజీత్'..బలంగా చెబుతోన్న టాలీవుడ్ సీనియర్ హీరో..మీరేమంటారు?
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2020 | 7:53 PM

బిగ్‌బాస్ సీజన్ 4 ఎండింగ్ దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వీక్షకుల ఫోకస్ మరింత పెరిగింది. తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేయించేందుకు తెగ ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కువమంది నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతాడని జోస్యం చెబుతున్నారు.  తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవారిలో అభిజీత్ చాలా తెలివైనవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే..అతడే విన్నర్ అవుతాడని నమ్మకంగా చెప్పారు.

ఇక హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారట. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో సైతం ఆయన ఈ షోని మిస్సవ్వకుండా చూస్తారట. గ‌తేడాది ఆయ‌న బిగ్‌బాస్ మూడో సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా వెళ్లారు శ్రీకాంత్. కంటెస్టెంట్ల‌తో డీల్ సెట్ చేసేందకు వెళ్లారు కానీ, ఎవ‌రూ ఆయన కోడ్ చేసిన డబ్బును పరిగణలోకి తీసుకోకుండా..గెలుపుపై నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పుడు నాల్గో సీజ‌న్‌ను కూడా ఆయ‌న బాగా ఫాలో అవుతున్న‌ట్లు తాజా కామెంట్స్‌ బట్టి అర్థమవుతోంది.

Also Read :

Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో

 ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు