బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..! అవునండీ మీరు విన్నది నిజమే. 'చిరుత' సినిమాలో చరణ్‌తో స్టెప్‌లు వేసిన నేహ శర్మ.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
Bigg Boss 14: బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..! అవునండీ మీరు విన్నది నిజమే. ‘చిరుత’ సినిమాలో చరణ్‌తో స్టెప్‌లు వేసిన నేహ శర్మ.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తెలుగులో కాదులెండి. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 ద్వారా హౌస్‌లోకి వెళ్లనుంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించనున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 14 అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ షోకి సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయింది. వారికి కరోనా టెస్టులు నిర్వహించి ఈ నెల 20వ తేదీ నుంచి ముంబైలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇక నెలాఖరున మరోసారి కరోనా పరీక్షలు చేస్తారని సమాచారం. ఇక అక్టోబర్ 1న మొదటి ఎపిసోడ్ షూటింగ్ మొదలు కానుంది. ఆ రోజే కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి ఎంటర్ కానున్నారు.
జాస్మిన్ భాసిన్, నిశాంత్ సింగ్ మాల్కని, నేహ శర్మ, ఇజాజ్ ఖాన్, పవిత్ర పునై, నైనా సింగ్, కుమార్ జానూ, అలీ గొనీ, రాహుల్ వైద్య, కరణ్ పటేల్, స్నేహ ఉల్లాల్, క్యారీ మినాటీ(యూట్యూబర్)తో పాటు మరో ముగ్గురు యూట్యూబర్ ఈ ఏడాది కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ బిగ్ బాస్ విన్నర్స్ హినా ఖాన్, గౌహర్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలు కూడా ఈ ఏడాది హౌస్‌లోకి స్పెషల్ సెగ్మెంట్ కోసం ఎంటర్ అవుతారని వినికిడి. ఏది ఏమైనా ఈ ఏడాది సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఇంకెన్ని కాంట్రవర్సీలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!