చిదంబరం అరెస్టు అనివార్యమా?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్నారు. చిదంబరం అక్కడ లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు కొందరు అధికారులు […]

చిదంబరం అరెస్టు అనివార్యమా?
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 10:45 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ వెంటాడుతోంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సుప్రీంలోనూ ఆయనకు ఊరట లభించలేదు. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు సీబీఐ అధికారులు దిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్నారు. చిదంబరం అక్కడ లేరని తెలుసుకొని వారు వెనుతిరిగారు. ఆయన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసినట్లు కొందరు అధికారులు తెలిపారు. సీబీఐతోపాటు ఈడీ కూడా ఆయన కోసం గాలిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ మరోసారి బుధవారం ఉదయాన్నే చిదంబరం ఇంటికి వెళ్లారు. దక్షిణ దిల్లీలోని జోర్‌బాఘ్‌ వద్ద ఉన్న చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. తీర్పు వెలువడినప్పటి నుంచి సీబీఐ బృందం ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. మరోవైపు ఆయన ఏ సమయంలోనైనా రావచ్చని భావించిన ఈడీ బృందం చిదంబరం నివాసం వద్దే కాచుకొని ఉన్నారు. కానీ, ఆయన రాకపోవడంతో వెళ్లిపోయారు.