AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేస్తే రైతు భరోసా రానట్లే!

Rythu Bharosa Scheme: రాష్ట్రంలో ఎవరైన అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం కన్నేసి ఉంచింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులగా తేలినట్లయితే వారిని పథకం నుంచి తొలగించనున్నారు..

Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేస్తే రైతు భరోసా రానట్లే!
Rythu Bharosa
Subhash Goud
|

Updated on: Mar 17, 2026 | 2:58 PM

Share

Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులకు ఏడాదికి రెండు విడుతలుగా అంటే 6000 చొప్పున మొత్తం 12 వేల రూపాయలు రైతులకు అందిస్తుంది ప్రభుత్వం. అయితే రెండు విడతలుగా మొత్తం రూ.12000 రైతుల ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

ఈ పథకాన్నిగత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతులకు రెండు దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం.

ఇది కూడా చదవండి: LPG Crisis India: ఇక సామాన్యులకు పండగే.. పండగ.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!

రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు?

ఈ రైతు భరోసా పథకానికి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి.

ఈ పొరపాటు చేస్తే డబ్బులు రావు:

అయితే రైతు భరోసా విషయంలో అర్హతలు ఉండాల్సిందే. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా మీ పేరుపైనే భూమి ఉండాలి. తప్పుడు పత్రాలను సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే సాగుకు యోగ్యం కాని భూములు (బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు. ఇలాంటి భూమి ఉండి దరఖాస్తు చేసుకుంటే పథకం సాయం అందదని గుర్తించుకోండి. అయితే ఎవరైన అనర్హులుగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి డబ్బులు రావని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Chanakya Niti: వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాణక్యుడు చెప్పిన 5 అద్భుతమైన సూత్రాలు!

ప్రభుత్వం నిఘా:

రాష్ట్రంలో ఎవరైన అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం కన్నేసి ఉంచింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులగా తేలినట్లయితే వారిని పథకం నుంచి తొలగించనున్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

ఇక గతంలో రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడు మళ్లీ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వద్ద ఉంటాయి. కొత్త రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు:

ప్రస్తుతం చాలా పథకాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఈ రైతు భరోసాకు అలాంటి అవకాశం లేదు. నేరుగా వ్యవసాయ కార్యాలయంలో మండలంలోని వ్యవసాయ విస్తీర్ణాధికారి లేదా క్లస్టర్‌ అధికారికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే గ్రామాల్లో పంచాయతీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంటారు. అలాంటి సమయంలో గ్రామంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన పత్రాలు:

పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీ తప్పనిసరి కావాల్సిందే. అంతేకాకుండా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్‌తో పాటు పథకానికి సంబంధించిన ఫారం పూరించి అందించాల్సి ఉంటుంది.

వీళ్లు దరఖాస్తు చేసుకుంటే సాయం అందదు:

ఈ పథకానికి అందరు అర్హులు కారని గుర్తించుకోండి. వీరు దరఖాస్తు చేసుకుంటే స్కీమ్‌ డబ్బులు రావని గుర్తించుకోండి. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉన్నవారికి కూడా పథకం వర్తించదు. అంటే బీడు భూములు, రాళ్లు రప్పలు ఉన్న భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని భూములు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు వంటివి.

వీళ్లకు కూడా వర్తించదు:

అలాగే ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాని రైతులు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంత మంది రైతులు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఈ పథకానికి అనర్హులు. రాజ్యాంగబద్ధమైన పదవులు (ప్రజాప్రతినిధులు) కలిగి ఉన్నవారికి కూడా వర్తించదు. దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. అయితే పథకానికి సంబంధించిన అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతుండవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మండల వ్యవసాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి. లేదా కార్యాలయాన్ని సంప్రదించండి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ తెలిపిన సుప్రీం కోర్టు.. ఇక వారికి కూడా ఇన్స్‌రెన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us