నీటి కష్టాలు..కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

చెన్నైలో గ్లాసు నీళ్ల కోసం అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. మరోవైపు బెంగళూరులో కూడా నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రతిపాదన చేసింది. బెంగళూరు నగరంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రతిపాదించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఈ ప్రతిపాదన గురించి మీడియాకు వెల్లడించారు. ‘నగరంలో కనీసం నీటి వసతి కూడా లేని అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. కనీసం నీరు కూడా […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:12 am, Fri, 28 June 19
నీటి కష్టాలు..కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

చెన్నైలో గ్లాసు నీళ్ల కోసం అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. మరోవైపు బెంగళూరులో కూడా నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రతిపాదన చేసింది. బెంగళూరు నగరంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రతిపాదించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఈ ప్రతిపాదన గురించి మీడియాకు వెల్లడించారు.

‘నగరంలో కనీసం నీటి వసతి కూడా లేని అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. కనీసం నీరు కూడా లేకుండా అపార్ట్‌మెంట్లు ఎలా విక్రయిస్తున్నారో తెలియడం లేదు. దీంతో ప్రజలు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. దాని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ పరిశీలించిన మీదట వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రతిపాదించాం. దీనిపై అధికారులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చర్చిస్తారు. ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటాం.’ అని పరమేశ్వర తెలిపారు. కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి బ్రేక్ వేయడంతో పాటు వివిధ మార్గాల ద్వారా బెంగళూరు నగరానికి నీటిని తరలించే పనులను ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.