బెంగుళూర్‌లో వాటర్ కష్టాలు…నిలువునా దోచేస్తున్న ట్యాంకర్ మాఫియా

బెంగళూరులోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరంలోని చాలా మంది ప్రజలు తాగడానికి గ్లాసు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. దీంతో వాటర్ టాంకర్ల మాఫియా రెచ్చిపోతుంది. వీధి, వీధికి వెళ్లి నీటిని సరఫరా చేయడానికి భారీ స్థాయితో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటర్ నిత్యావసరం అవ్వడంతో ప్రజలు కూడా చేసేది లేక టాంకర్ల వాళ్లు చెప్పిన ధరకే నీటిని కొనుక్కొవాల్సిన పరిస్థితి ఏర్ఫడింది. బెంగుళూర్ సిటీలో ఎన్నో ఎత్తైన భవంతులతో ఉన్న ఒక ప్రాంతం […]

బెంగుళూర్‌లో వాటర్ కష్టాలు...నిలువునా దోచేస్తున్న ట్యాంకర్ మాఫియా
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:03 PM

బెంగళూరులోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరంలోని చాలా మంది ప్రజలు తాగడానికి గ్లాసు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. దీంతో వాటర్ టాంకర్ల మాఫియా రెచ్చిపోతుంది. వీధి, వీధికి వెళ్లి నీటిని సరఫరా చేయడానికి భారీ స్థాయితో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటర్ నిత్యావసరం అవ్వడంతో ప్రజలు కూడా చేసేది లేక టాంకర్ల వాళ్లు చెప్పిన ధరకే నీటిని కొనుక్కొవాల్సిన పరిస్థితి ఏర్ఫడింది.

బెంగుళూర్ సిటీలో ఎన్నో ఎత్తైన భవంతులతో ఉన్న ఒక ప్రాంతం బెల్లందర్. ఇక్కడ నివసించేవారందరూ కూడా ఉన్నత ఉద్యోగాలు చేసేవారే. దీంతో ఈ ప్రాంతంలో నీటి కొరత తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఇటువంటి చోట నీటిని కొనుక్కోవడం కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో 6,000 లీటర్ల ట్యాంకర్ నీటిని సరఫరా చేసే ధర రూ 800 నుంచి రూ .1300-1400 వరకు పెరిగినట్లు ది హిందూ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం బెల్లందర్ ప్రాంతంలో దాదాపు 1000 అపార్ట్‌మెంట్స్ వరకు చుక్కనీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే రానున్న ఏప్రెల్, మే నెలల్లో ఎండలు ముదిరి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు.

పరిస్ధితి ఎలా తయారయ్యింది అంటే…వాటర్ సప్లయిర్స్ అంతా అపార్ట్‌మెంట్ వాసులను ఒక చోటకి పిలిపించి వేలంపాట నిర్వహిస్తున్నారు. ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ డబ్బును కోడ్ చేస్తారో వారికే నీటి సరఫరా చేయనున్నారు. వచ్చే మూడు నెలల్లో నీటి ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని ప్రజలు వాపోతున్నారు. బెంగళూరు సుదీర్ఘకాలం నుంచి నీటి సమస్యలను ఎదుర్కొంది. వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంటుందని నివేదికలు ముందుగా హెచ్చరిస్తున్నా…. ప్రభుత్వం గానీ, అధికారులు గాని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విపరమవుతూనే ఉన్నారు.