Facebook Live-Streaming : సరదా తీసిన ప్రాణం..
ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు బానిసలైపోయారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలకు ఎంత అడిక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇందులో టిక్ టాక్ వీడియోస్ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తే.. ఇక ఫేస్ బుక్‌ని మాత్రం నిద్ర లేచినప్పటి నుంచి పోస్టింగ్స్ పెడుతూ.. ఎక్కడికి వెళ్తున్నారన్నది కూడా లైవ్ పెడతారు కొందరు. అయితే ఇది నార్మల్‌గా పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ.. రన్నింగ్‌లో పెడితే మాత్రం ప్రమాదాలు కొనితెచ్చకున్నట్లు అవుతుంది. తాజాగా వెస్ట్ […]
ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు బానిసలైపోయారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియాలకు ఎంత అడిక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇందులో టిక్ టాక్ వీడియోస్ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తే.. ఇక ఫేస్ బుక్‌ని మాత్రం నిద్ర లేచినప్పటి నుంచి పోస్టింగ్స్ పెడుతూ.. ఎక్కడికి వెళ్తున్నారన్నది కూడా లైవ్ పెడతారు కొందరు. అయితే ఇది నార్మల్‌గా పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ.. రన్నింగ్‌లో పెడితే మాత్రం ప్రమాదాలు కొనితెచ్చకున్నట్లు అవుతుంది.
తాజాగా వెస్ట్ బెంగాల్‌లో జరిగిన సంఘటన చూస్తే నిజమనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అందాల్ పట్టణానికి చెందిన చంచల్ ధిబోర్ అనే 24 ఏళ్ల యువకుడు శనివారం సాయంత్రం పట్టణంలోని కాళీ మాత గుడికి బైక్‌పై వెళ్లాడు. అనంతరం గుడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో.. బైక్ నడుపుతూనే ఫోన్ తీసి అందులో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేశాడు. అలా ఎఫ్బీ లైవ్ పెట్టి కాస్త ముందుకు వెళ్లాడో లేదో.. బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు దెబ్బ తగిలింది. అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు గట్టిగా దెబ్బ తగలడంతో.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించాడు.
కాగా, మృతుడి స్నేహితులు.. ఎఫ్బీ లైవ్ గురించి స్పందించారు. చంచల్ బండి నడపడం, కింద పడిపోవడం, అది చూసినవారు వచ్చి హెల్ప్ చేయడం అంతా ఫేస్ బుక్ లైవ్ లో కనిపించిందని.. ఇలా బైక్ నడుపుతూ లైవ్ పెట్టి.. చనిపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు.