Good News: ఇక పోలింగ్ స్టేషన్ వెళ్లకుండానే.. ఓటు వేసే అవకాశం..!!

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ప్రతి అయిదేళ్లకు ఓ సారి వస్తుంటాయి. కానీ ప్రైవేట్ ఉద్యోగులు అందరూ.. వారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం.. ఉద్యోగ రీత్యా.. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉండటమే ముఖ్య కారణం. నాన్ లోకల్‌గా ఉన్న సమయంలో ఎదురయ్యే పరిస్థితి ఇది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల్లో పోలింగ్ బూత్‌కు వెళ్ళకుండానే ఓటు వేయడానికి వీలు కల్పించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు […]

Good News: ఇక పోలింగ్ స్టేషన్ వెళ్లకుండానే.. ఓటు వేసే అవకాశం..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 5:39 AM

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ప్రతి అయిదేళ్లకు ఓ సారి వస్తుంటాయి. కానీ ప్రైవేట్ ఉద్యోగులు అందరూ.. వారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం.. ఉద్యోగ రీత్యా.. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉండటమే ముఖ్య కారణం. నాన్ లోకల్‌గా ఉన్న సమయంలో ఎదురయ్యే పరిస్థితి ఇది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది.

ఎన్నికల్లో పోలింగ్ బూత్‌కు వెళ్ళకుండానే ఓటు వేయడానికి వీలు కల్పించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. దీని కోసం ఐఐటీ-మద్రాస్ వారి సహకారం తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా వెల్లడించారు.

పోలింగ్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎలా ఓటు వేయాలన్న దానిని వివరించారు. ఉదాహరణకు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. చెన్నైకి సబంధించిన ఓటర్.. ఢిల్లీలో ఉంటే.. తన నియోజకవర్గంలో ఓటు వేయడానికి వెళ్లకుండా.. ఈసీ ముందుగా నిర్ణయించి.. ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్ళి ఓటు వేయవచ్చు. ముందుగా నిర్ణయించిన కేంద్రానికి, నిర్ణీత సమయంలో ఓటరు వెళ్ళవలసి ఉంటుందని సక్సెనా తెలిపారు. అయితే ఇది ఓటరు తన ఇంటి దగ్గర నుంచి ఓటు వేయవచ్చునని భావించరాదని వివరించారు.

ప్రస్తుతం ఈ ప్రయత్నాలు పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నయని.. దీనిని బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించి అభివృద్ధిపరుస్తున్నట్లు వివరించారు. ఇది టూ-వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అని సక్సెనా తెలిపారు. దీనికోసం కేటాయించిన ఇంటర్నెట్ లైన్స్‌పై వైట్ లిస్టెడ్ ఐపీ డివైస్‌లు, బయోమెట్రిక్ పరికరాలు, వెబ్ కెమెరాలతో పని చేస్తుందని వివరించారు.