Cybersecurity: ఆ సినిమాలు డౌన్‌లోడ్ చేస్తే మీ కంప్యూటర్‌ మటాష్!

Cybersecurity: ఆధునిక సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ రంగం మీద టెక్నాలజీ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా పైరసీ కారణంగా సినీ రంగానికి భారీగా నష్టాలు వస్తున్నాయి. సినిమా రిలీజ్‌ అయిన గంటల్లోనే పైరసీ కాపీలు వచ్చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే జనం తగ్గిపోతున్నారు. అయితే జనాలు ఇలా పైరసీ సినిమాలు డౌన్‌లోడ్ చేస్తుండటంతో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఈ డౌన్‌లోడ్‌ రూపంలో కంప్యూటర్లలోకి […]

Cybersecurity: ఆ సినిమాలు డౌన్‌లోడ్ చేస్తే మీ కంప్యూటర్‌ మటాష్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 16, 2020 | 3:58 PM

Cybersecurity: ఆధునిక సాంకేతికత సమాజానికి ఎంత మంచి చేస్తుందో అదే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్మెంట్ రంగం మీద టెక్నాలజీ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా పైరసీ కారణంగా సినీ రంగానికి భారీగా నష్టాలు వస్తున్నాయి. సినిమా రిలీజ్‌ అయిన గంటల్లోనే పైరసీ కాపీలు వచ్చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే జనం తగ్గిపోతున్నారు. అయితే జనాలు ఇలా పైరసీ సినిమాలు డౌన్‌లోడ్ చేస్తుండటంతో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఈ డౌన్‌లోడ్‌ రూపంలో కంప్యూటర్లలోకి వైరస్‌లు ప్రవేశ పెడుతున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ కూడా సైబర్ క్రైమినల్స్‌కు ఇష్టమైన వేదిక. కాగా.. ఇటీవల ఆస్కార్‌ అవార్డులలో సత్తా చాటిన పలు హాలీవుడ్‌ చిత్రాల ద్వారా ఈ దాడి జరుగుతున్నట్టుగా నెటిజెన్లను హెచ్చరించారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్ స్కీ ఈ దాడికి సంబంధించిన వార్తను వెల్లడించింది. ముఖ్యంగా జోకర్‌ సినిమా డౌన్‌లోడ్‌ల ద్వారా వైరస్‌ ఎటాక్‌ జరుగుతున్నట్టుగా గుర్తించినట్టుగా తెలిపింది. ఈ సినిమాలో నటించిన జొవాక్విన్ ఫీనిక్స్ కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు కూడా లభించింది. 1917, ఐరిష్‌ మ్యాన్‌ లాంటి సినిమా లింకుల్లో కూడా పెద్ద సంఖ్యలో మాల్‌ వేర్‌ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆ సినిమాలు డౌన్‌లోడ్ చేయటం కన్నా ఆ సినిమాలు అందిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థల నుంచి అధికారికంగా చూడటమేకరెక్ట్‌ అని సూచిస్తున్నారు.