AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..

Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. […]

Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 16, 2020 | 5:15 PM

Share

Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు. తన మూడు నెలల జీతాన్ని బాధితులకు సాయంగా అందిస్తానన్న కిషన్‌రెడ్డి.. తమ ఎంపీల తరపున మరో 25 లక్షలను ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామి ఇచ్చారు.

గత నెలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో.. భైంసాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూశారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి 17 మందిని అరెస్టుచేశామని పోలీసులు తెలిపినా.. రాజకీయంగా విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు భైంసాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయన వెంట లక్ష్మణ్‌, ఎంపీలు అరవింద్‌, సంజయ్‌, సోయం ఉన్నారు.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..