AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Recruitment 2026: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. 60 వేల వరకు జీతం!

BEL Recruitment 2026: బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం Bharat Electronics Limited (BEL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీతో పాటు అనుభవం తప్పనిసరి. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

BEL Recruitment 2026: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. 60 వేల వరకు జీతం!
Bel Notification 2026
Rajashekher G
|

Updated on: May 25, 2026 | 6:02 PM

Share

బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థ Bharat Electronics Limited (BEL) బెంగళూరులోని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ – 25 పోస్టులు

  • జనరల్ – 11
  • ఓబీసీ (ఎన్‌సీఎల్) – 6
  • ఈడబ్ల్యూఎస్ – 2
  • ఎస్సీ – 4
  • ఎస్టీ – 2

ప్రాజెక్ట్ ఇంజినీర్ – 1 – 31 పోస్టులు

  • జనరల్ – 12
  • ఓబీసీ (ఎన్‌సీఎల్) – 9
  • ఈడబ్ల్యూఎస్ – 3
  • ఎస్సీ – 5
  • ఎస్టీ – 2

విద్యార్హతలు

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుకు కనీసం ఐదేళ్ల అనుభవం, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రెండేళ్ల పని అనుభవం అవసరం.

వయోపరిమితి

2026 జూన్ 1 నాటికి

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుకు గరిష్ట వయసు – 40 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ – 1 పోస్టుకు గరిష్ట వయసు – 32 సంవత్సరాలు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

కాంట్రాక్ట్ వ్యవధి

ప్రారంభంలో మూడేళ్లపాటు కాంట్రాక్ట్ ఆధారంగా నియామకం ఉంటుంది. అభ్యర్థి పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.

జీతభత్యాలు

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు నెలకు రూ.60,000
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ – 1కు నెలకు రూ.40,000

కాంట్రాక్ట్ పొడిగించిన ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున జీతం పెరుగుతుంది. అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్, దుస్తుల అలవెన్స్, స్టిచింగ్ ఛార్జీలు, ఫుట్‌వేర్ అలవెన్స్‌ల రూపంలో ప్రత్యేక భత్యాలు కూడా అందిస్తారు.

ఎంపిక విధానం

అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను BEL అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించడంతో పాటు అభ్యర్థుల ఈమెయిల్‌కు సమాచారం పంపిస్తారు.

దరఖాస్తు ఫీజు

  • ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ – రూ.450 + జీఎస్టీ
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ – 1 – రూ.400 + జీఎస్టీ
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం – 20 మే 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ – 08 జూన్ 2026

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి Careers విభాగంలో సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు వేర్వేరు అప్లికేషన్ లింకులు ఉంటాయి. అవసరమైన వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పూర్తవుతుంది.

Follow Us
BEL జాబ్స్ బంపర్ ఆఫర్.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు 60 వేల జీతం!
BEL జాబ్స్ బంపర్ ఆఫర్.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు 60 వేల జీతం!
తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!
తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!
డ్రైవర్‌ను తక్కువ చేసి నవ్విన అమ్మాయిలు..ఫైర్ అవుతున్న నెటిజన్లు
డ్రైవర్‌ను తక్కువ చేసి నవ్విన అమ్మాయిలు..ఫైర్ అవుతున్న నెటిజన్లు
IPL 2026: ఐపీఎల్ లో ఈరోజు మ్యాచ్ ఎందుకు లేదో తెలుసా?
IPL 2026: ఐపీఎల్ లో ఈరోజు మ్యాచ్ ఎందుకు లేదో తెలుసా?
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. మెకానిక్ దగ్గరికి వెళ్లే ముందు..
మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. మెకానిక్ దగ్గరికి వెళ్లే ముందు..
గరుడ పురాణం: భార్య కంటే ముందే భర్త ఎందుకు మరణిస్తాడు?
గరుడ పురాణం: భార్య కంటే ముందే భర్త ఎందుకు మరణిస్తాడు?
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎంత పెరగనున్నాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎంత పెరగనున్నాయో తెలుసా..?
అరుదైన 'పద్మినీ ఏకాదశి'.. పర్సులో ఆ ఒక్కటి ఉంచితే చాలు..
అరుదైన 'పద్మినీ ఏకాదశి'.. పర్సులో ఆ ఒక్కటి ఉంచితే చాలు..
ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోష
ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోష
ఐస్‌క్రీమ్‌లు కాదు.. ఇవి తింటే బాడీ కూలింగ్ మిషన్‌లా మారుతుంది
ఐస్‌క్రీమ్‌లు కాదు.. ఇవి తింటే బాడీ కూలింగ్ మిషన్‌లా మారుతుంది