నకిలీ పత్రాలతో బ్యాంక్ లోన్.. చీటింగ్ గ్యాంగ్ అరెస్ట్

విలువైన భూములపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసిన ముఠాను గురువారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేశారు.

నకిలీ పత్రాలతో బ్యాంక్ లోన్.. చీటింగ్ గ్యాంగ్ అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 20, 2020 | 8:32 PM

విలువైన భూములపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసిన ముఠాను గురువారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ లోన్ తీసుకొని మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేశారు. నిరంజన్, క్రిష్ణ, లక్ష్మినారాయణ, ప్రభాకర్ లు ఓ ముఠాగా ఏర్పడి బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

2012 లో ఈ ముఠా సభ్యులు.. నకిలీ భూమి పత్రాలు పెట్టి బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర నుంచి 1 కోటి 8 లక్షలు లోన్ గా తీసుకున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సిన వాయిదాలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ సిబ్బంది ఎంక్వేరి చేశారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. అసలు భూములు లేకుండానే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తేల్చారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి మోసం చేసినట్టు గుర్తించారు. నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్నట్లు ముఠా సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు బ్యాంక్ మేనేజర్. దీంతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిరంజన్, క్రిష్ణ, లక్ష్మినారాయణ, ప్రభాకర్ లను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. నకిలీ పత్రాలను క్రియేట్ చేసి.. బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.