AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank holidays in March: అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 రోజులు మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మూడు రోజుల బ్యాంక్ బంద్‌తో పాటుగా సాధారణ సెలవులు, పండగ సెలవులు వెరసి 16 రోజులు కలిపి ఏకంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి...

Bank holidays in March: అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్...
Ravi Kiran
|

Updated on: Feb 29, 2020 | 2:33 PM

Share

Bank holidays in March 2020: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 రోజులు మార్చి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మూడు రోజుల బ్యాంక్ బంద్‌తో పాటుగా సాధారణ సెలవులు, పండగ సెలవులు వెరసి 16 రోజులు కలిపి ఏకంగా 19 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక అటు వేతనాల పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)… మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనుంది. కాగా 20 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తుంటే, 12. 5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. మరి వాళ్ల చర్చలు ఎంతవరకు సఫలం కానున్నాయో వేచి చూడాల్సిందే. 

మార్చిలో సెలవు రోజులు ఇలా ఉన్నాయి…

మార్చి 1 – ఆదివారం

మార్చి 5 – పంచాయతీ రాజ్ దినోత్సవం(ఒడిశా)

మార్చి 6- చాప్చర్‌కుట్ పండగ(మిజోరాం)

మార్చి 8 – ఆదివారం

మార్చి 9 – హజరత్ అలీ పండగ(ఉత్తరప్రదేశ్)

మార్చి 10 – డోల్ పూర్ణిమ(ఒడిశా, వెస్ట్ బెంగాల్, త్రిపురా), హోళీ

మార్చి 11 నుంచి 13 – బ్యాంకుల సమ్మె

మార్చి 14 – రెండో శనివారం

మార్చి 15 – ఆదివారం

మార్చి 22 – సండే

మార్చి 23 – షాహిద్ భగత్ సింగ్ డే(హర్యానా)

మార్చి 25 – ఉగాది(కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, జమ్మూ కశ్మీర్)

మార్చి 26 – చేటిచంద్ యానివర్సరీ( గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్)

మార్చి 27 – సర్హుల్ పండగ( ఝార్ఖండ్)

మార్చి 28 – నాలుగో శనివారం

మార్చి 29 – ఆదివారం

For More News: 

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?

కోహ్లీకి అసలు ఏమైంది.?

వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..