Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

BJP Donations: కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

2018 ఎన్నికల ముందు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆ పార్టీకి సుమారు రూ.742 కోట్లు రాగా.. కాంగ్రెస్‌కు రూ.148 కోట్లు విరాళాలు సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Political Party Donations, BJP Donations: కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

Political Party Donations: 2018 ఎన్నికల ముందు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆ పార్టీకి సుమారు రూ.742 కోట్లు రాగా.. కాంగ్రెస్‌కు రూ.148 కోట్లు విరాళాలు సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2017-18లో రూ.437 కోట్లు విరాళాలు వస్తే.. 2018-19లో అది కాస్తా 70 శాతానికి పెరిగినట్లు నివేదిక చెబుతోంది. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే 2017-18లో ఆ పార్టీకి కేవలం రూ.26 కోట్లు మాత్రమే రాగా.. 2018-19కి మాత్రం రూ.148 కోట్లు వచ్చాయి.

ఇక బీజేపీకి వచ్చిన భారీ విరాళాలు 5 జాతీయ పార్టీలకు వచ్చిన డొనేషన్స్ మొత్తం కంటే 3 రేట్లు ఎక్కువ అని సంస్థ తెలిపింది. అయితే డోనేషన్లలో ఎక్కువ శాతం నిధులు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయట. అటు బీఎస్పీ తమకు 2018-19లో రూ.20,000లకు మించి విరాళాలు రాలేదని స్పష్టం చేసింది. తమకు గత 13 ఏళ్లుగా ఇంత మొత్తం మేరకు మాత్రమే విరాళాలు అందుతున్నట్లు ఆ పార్టీ తెలిపింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ప్రోగ్రెస్సివ్ ఎలెక్టోరల్ ట్రస్ట్ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ శాతం విరాళాలు ఇస్తున్నట్లు నివేదికలో తేలింది.

For More News: 

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?

కోహ్లీకి అసలు ఏమైంది.?

వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

Related Tags